Switch to English

వ్యతిరేక మీడియాపై కేసీఆర్ బాటలో జగన్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మీడియాను నియంత్రించడంలోనూ, తన దారికి తెచ్చుకోవడంలోనూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మించినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్ల విషయంలో ఆయన అనుసరించిన వైఖరి చూస్తే ఇది నిజమనిపించక మానదు. అధికారంలోకి రాగానే ఆ రెండు ఛానళ్లు రాష్ట్రంలో ప్రసారం కాకుండా చేయడంలో ఆయన విజయం సాధించారు.

కేబుల్ ఆపరేటర్లకు మౌఖిక ఆదేశాలివ్వడం ద్వారా తెలంగాణలో ఆ రెండు ఛానళ్లు రాకుండా చేశారు. దీంతో ఆ రెండు ఛానళ్లకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి కలిగింది. ఈ క్రమంలో టీవీ9 ముందుగా ప్రభుత్వ పెద్దలతో రాజీకి వచ్చి తెలంగాణలో తన ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యేలా చేసుకుంది. ఏబీఎన్ మాత్రం కొంతకాలం పోరాడింది. కోర్టుకు కూడా వెళ్లింది. అయితే, ప్రభుత్వమే తమ ఛానల్ రాకుండా చేసిందని నిరూపించడంలో విఫలమైంది. ఇక ఏడాదిపాటు పోరు కొనసాగించిన ఆ ఛానల్.. చివరకు చేతులెత్తేసి రాజీ పడాల్సి వచ్చింది. ఆ తర్వాతే తెలంగాణలో ఆ ఛానల్ ప్రసారాలు పున:ప్రారంభమయ్యాయి.

Also Read: వైఎస్‌ జగన్‌ ఎవరికి బినామీ.? జనసేన ‘పవర్‌’ పంచ్‌.!

సరిగ్గా ఇప్పుడు ఇదే బాటను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆది నుంచి తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లపై అనధికార వేటు వేసింది. ఆ రెండు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కేబుల్ ఆపరేటర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో గురువారం సాయంత్రం నుంచి ఆ రెండు జిల్లాల్లో ఈ రెండు ఛానళ్లు రావడంలేదు.

టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి డీటీహెచ్ సేవలు పొందుతున్నవారికి మినహా సాధారణ కేబుల్ ప్రసారాలు వీక్షిస్తున్నవారికి ఈ రెండు ఛానళ్లు రావడంలేదు. ముఖ్యంగా చలో ఆత్మకూరు వ్యవహారంలో ఈ రెండు ఛానళ్లు పూర్తిగా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా వ్యవహరించడంతో ఆగ్రహించిన ప్రభుత్వ పెద్దలు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రెండు జిల్లాల్లోనే నిషేధం విధించినా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో సాక్షి టీవీపై ఇలాంటి ఆంక్షలే విధించారు. కేసీఆర్ ప్రారంభించిన ఈ విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించగా.. తాజాగా జగన్ సైతం అదే బాటలో వెళ్తున్నారు. కాగా, దీనిపై ఏబీఎన్ ఛానల్ స్పందించింది. కేబుల్ ప్రసారాల్లో ఏబీఎన్ ఛానల్ రాకపోతే తొలుత కేబుల్ ఆపరేటర్ ను డిమాండ్ చేయాలని, 72 గంటల తర్వాత కూడా ప్రసారాలు పునరుద్ధరించకుంటే నోడల్ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...