తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈరోజు తెల్లవారుఝాము నుంచి IT శాఖ దాడులు నిర్వహిస్తోంది. అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఇటివల నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లు, సంస్థల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. ఐటీ శాఖకు చెందిన దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.
మల్లారెడ్డికి చెందిన బోయినపల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోని ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఐటీ రిటర్న్స్, చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయేమో అనే కోణంలోనూ పలు పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
186553 432019Magnificent web site. A lot of helpful info here. 163819
319918 412143Hey there! I just wanted to ask if you ever have any trouble with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no data backup. Do you have any solutions to stop hackers? 148104