Switch to English

ఢిల్లీలో కేసీఆర్.. ష్ గప్ చుప్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు హస్తిన వెళ్లినా.. పెద్ద అజెండాయే ఉంటుంది. వీలును బట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చి వస్తుంటారు. అలాగే మీడియాతో కూడా మాట్లాడి, వివరాలన్నీ చెబుతారు. కానీ ఈసారి మాత్రం ఆయన పర్యటన అంతా గప్ చుప్ గా సాగిపోయింది. ఓ వివాహ రిసెప్షన్ కు హాజరు కావడం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఆ ఒక్క కార్యక్రమం మాత్రమే చూసుకుని తిరిగి వచ్చేయడం విశేషం. వాస్తవానికి వీలుంటే ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

కానీ కేసీఆర్ ఏ ఒక్కరినీ కలవలేదు.. అసలు ఎవరినీ కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. సోమవారం రాత్రి హస్తిన వెళ్లిన ఆయన.. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు రాలేదు. సాయంత్రం రిసెప్షన్ కు వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, వెంటనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. పైగా 24 గంటలపాటు ఢిల్లీలో ఉన్నా.. ఒక్క నిమిషం కూడా మీడియాతో మాట్లాడలేదు. విమానాశ్రయంలో జాతీయ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించినా.. కేసీఆర్ స్పందించలేదు.

ముఖ్యంగా దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైనే మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. దిశ ఘటనపై దేశం మొత్తం ఆందోళనలు సాగుతున్నా.. కనీసం బాధితురాలి కుటుంబ సభ్యులను పలకరించకపోవడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. బాధితురాలి కుటుంబ పరామర్శ కంటే వివాహ వేడుకే మీకు ముఖ్యమా అని అడిగినా.. కేసీఆర్ మౌనమే తన సమాధానంగా ఏమీ మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపోయారు. దిశ ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం కదలినా.. కేసీఆర్ మాత్రం స్పందించలేదు.

బాధితురాలి ఇంటికి వెళ్లడం అటుంచితే, అసలు ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనిపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో దిశ ఘటనపై మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుమించి ఒక్క ముక్క కూడా కేసీఆర్ నోటి నుంచి రాలేదు. పైగా హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత అధికార పార్టీ నుంచి నామమాత్ర స్పందన మాత్రమే వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై మాట్లాడకపోవమే మంచిదని కేసీఆర్ భావించినట్టు సమాచారం. అందుకే ఢిల్లీ పర్యటనలో ఎవరినీ కలవకుండానే తిరిగొచ్చేశారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....