జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తీరుపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలే కాదు.. బల్దియా అధికారులు కూడా గుర్రుగా ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఆకస్మిక పర్యటనలు, సమావేశాలు నిర్వహించడం.. ప్రోటోకాల్ ప్రకారం కనీసం స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకే కాదు.. సాక్షాత్తు కమిషనర్ కు కూడా సమాచారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. దీంతో మేయర్‌పై కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. కార్పొరేటర్ల సమస్యలు కూడా మేయర్ వినడంలేదంటున్నారు.
జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు తాను వచ్చేవరకు జరపకూడదంటూ విజయలక్ష్మి అర్దర్లు వేయడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉంటున్నారట. ఇటీవల కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మేయర్‌కు తెలియకుండా కొన్ని ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసిన ఇంజినీర్లు, అధికారులకు మోమోలు కూడా జారీ చేశారు. కమిషనర్ లోకేష్ కుమార్ సైతం మేయర్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట.
ఎల్బీనగర్ లోతట్టు ప్రాంతాల్లో విజయలక్ష్మీ పర్యటన, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు పీపీఈ కిట్ల పంపిణీకి కమిషనర్ కు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. నగరంలో వర్షం కురిసినపుడు నాలాల పూడికతీత పనులను మేయర్, కమిషనర్ కలిసి తనిఖీలు చేయాలని మంత్రి కేటీఆర్ సమీక్షలో ఆదేశించినా మేయర్ పాటించడంలేదని అంటున్నారు. దీంతో పాలక మండలి, అధికార యంత్రాంగాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు జోరందుకున్నాయి.
247361 825229Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 720483
479887 98016Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why waste your intelligence on just posting videos to your weblog when you could be giving us something informative to read? 98449
544486 251348A lot of thanks for this particular info I was basically browsing all Search engines to discover it! 282741
519812 576514magnificent submit, very informative. I ponder why the opposite experts of this sector dont realize this. You must proceed your writing. Im positive, youve an excellent readers base already! 326063