హీరోయిన్లుగా అవకాశాల కోసం హాట్ ఫొటో షూట్ లు చేయడం.. కొన్ని సినిమాల్లో మరీ బోల్డ్ గా నటించడం వంటివి హీరోయిన్స్ చాలా కామన్ గా చేసేవి. అయితే అవి వారి జీవితంలో తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే సందర్బాలు వస్తాయి అని మాత్రం వారు ముందే ఊహించుకోలేక పోతున్నారు. ఆ మధ్య ఒక హీరోయిన్ గతంలో తాను హాట్ గా షేర్ చేసిన ఫొటోలను నేను డిలీట్ చేశాను. మీరు కూడా నా ఫొటోలు మీ వద్ద ఉంటే.. మీ సోషల్ మీడియా అకౌంట్ లో ఉంటే డిలీట్ చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది.
ఆమె ఎంత విజ్ఞప్తి చేసినా కూడా ప్రయోజనం మాత్రం శూన్యం. ఎందుకంటే ఒక్క ఫొటో సోషల్ మీడియాలో ఒక్కసారి వైరల్ అయ్యింది అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు కత్తి హీరోయిన్ సనా ఖాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ అమ్మడు ఇటీవలే గుజరాతీ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఆమె తన హాట్ ఫొటోలు మరియు వీడియోలను సోషల్ మీడియా నుండి తొలగించాలని కోరుకుంటుంది. అందుకు గాను ఆమె సోషల్ మీడియా ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తుంది.
ఇప్పటికే తన అకౌంట్ ను క్లీయర్ చేసిన ఈ అమ్మడు ఇతర అకౌంట్ లో ఉన్న ఫొటోలను మాత్రం తీయడం సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తించలేక పోతుంది. ఎంతో మంది అడ్మిన్స్ సోషల్ మీడియాలో అకౌంట్ తీసుకుని ఫొటోలు షేర్ చేసి కొన్నాళ్లకు ఆ అకౌంట్ నే పట్టించుకోరు. అలాంటి అకౌంట్ ల్లోకి వెళ్లినప్పుడు ఫొటోలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని తొలగించడం అనేది సాధ్యం కాదు. కాని హీరోయిన్స్ మాత్రం ప్లీజ్ తొలగించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మొదటే ఇలాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందేమో అనే విషయాన్ని ఆలోచించుకోవాలి.
[url=http://gjgjgjgdgs.com]http://gjgjgjgdgs.com[/url]
586178 112996Id need to verify with you here. Which isnt one thing I often do! I get pleasure from reading a put up that will make individuals feel. Furthermore, thanks for allowing me to comment! 999554
986507 134548My spouse and I stumbled more than here from a different site and thought I may as effectively check items out. I like what I see so now im following you. Appear forward to going over your web page repeatedly. 54403