Switch to English

అదే జరిగితే వైఎస్‌ జగన్‌కి ‘హేట్సాఫ్‌’ చెప్పాల్సిందే..

కరోనా వైరస్‌ని నిర్ధారించేందుకు చేసే పరీక్షల ‘కిట్‌’ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతోంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌ ఒక్కో కిట్‌ ధరనీ కేవలం 330 రూపాయలకే కొనుగోలు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 730 రూపాయలు వెచ్చించి అదే కిట్‌ని కొనుగోలు చేయడం గమనార్హం.

ఇప్పటికే ‘కిట్స్‌’ కొనుగోలు కోసం 25 శాతం చెల్లింపులు కూడా జరిగాయని ప్రభుత్వమే చెబుతోంది. అయితే, ‘కరోనా టెస్టింగ్‌ కిట్స్‌’ పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి పాల్పడిందనే విపక్షాల విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం సంకటంలో పడింది. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితిపై అధికారులతో చర్చించారు. అనంతరం అధికారుల్ని అభినందించారు.. తొలుత ఆ కిట్స్‌ ధర ఎక్కువగానే వుందనీ, ఒకవేళ ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు కిట్స్‌ అందిస్తే, అదే ధరకు తమకూ అందివ్వాలనే షరతు ముందే విధించామనీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. అది సాధ్యమేనా.?

25 శాతం చెల్లింపులు జరిగిపోయాక, కిట్స్‌ ధరని తగ్గించేందుకు తయారీ సంస్థలు ముందుకొస్తాయా.? ఒకవేళ వచ్చినా, ఆ 25 శాతం చెల్లింపుల్లోంచి మిగిలిన మొత్తాన్ని తిరిగిచ్చే అవకాశం వుంటుందా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయి. దక్షిణ కొరియా నుంచి ఈ కిట్స్‌ని మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడే ఆ కిట్స్‌ తయారీ ఇప్పుడు జరుగుతున్నందున ధర తగ్గిందన్నది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వాదన.

ఏదిఏమైనా, వైఎస్‌ జగన్‌.. అధికారుల్ని ఈ ‘కిట్స్‌ కొనుగోలు’ వ్యవహారంపై అభినందించిన దరిమిలా, ఆ అభినందనలకు తగ్గట్టుగా ‘కిట్స్‌’ ధరలు తగ్గి, రాష్ట్ర ఖజనానికి చిల్లుపడకుండా వుంటే, వైఎస్‌ జగన్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. అయితే, ‘తెరవెనుక లాలూచీలు చాలా వుంటాయ్‌.. సూట్‌కేస్‌ వ్యవహారాలు నడపడంలో ఆరి తేరినోళ్ళు అధికారంలో వున్నారు.. తిమ్మిని బమ్మిని చేయడం వాళ్ళకు అలవాటే..’ అని విపక్షాలు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే వున్నాయి.

మొత్తమ్మీద, ‘సంక్షోభాల్ని అవకాశాలుగా’ మలచుకోవడంలో సిద్ధహస్తులైనవారికి.. కరోనా వైరస్‌ నుంచి ‘లాభాలు’ ఆర్జించడంలో వింతేముంది.? అన్నది సగటు ఆంధ్రపదేశ్ ప్రజల ప్రశ్న.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

రంజాన్‌ స్పెషల్‌: ‘హలీం’కి ఊరట దక్కేనా.?

హలీం.. రంజాన్‌ స్పెషల్‌ వంటకం ఇది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చెందిన భోజన ప్రియుల్నీ తనవైపుకు తిప్పుకున్న ప్రత్యేక వంటకంగా హలీం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడో విదేశాల్లో పుట్టి,...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...

ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్...