మాస్ మహారాజా రవితేజ సినిమా, సినిమాకు మధ్య పెద్దగా గ్యాప్ తీసుకోడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఏడాదికి మూడు సినిమాలు అందిస్తూ వస్తున్నాడు. అయితే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేయాల్సిన మూవీ ఇప్పుడు హోల్డ్ లో పడింది. ఈ ప్రాజెక్ట్ నే బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే రవితేజ తనకు వచ్చిన గ్యాప్ ను ఒక రీమేక్ తో ఫీల్ చేయబోతున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ బాలీవుడ్ చిత్రం రైడ్ ను రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ లు, ఫోటోషూట్ లు పూర్తైపోయాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ పై హింట్ వచ్చేలా ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసాడు.
అయితే ఇది నిజంగానే రైడ్ రీమేకా లేక స్ట్రెయిట్ సినిమానా అన్నది తేలాల్సి ఉంది.