మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?
కథ:
రమణ (మహేష్ బాబు), తన తండ్రి (జయరాం)ను తన తల్లి వసుంధర (రమ్య కృష్ణ) చిన్నతనంలోనే వదిలేస్తుంది. ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడు వైరా (ప్రకాష్ రాజ్) కూతురు. గుంటూరులో ఎగ్రసివ్ కుర్రాడిగా ఎదుగుతాడు రమణ. వైరా వద్ద పనిచేసే లాయర్ (మురళి శర్మ) కూతురు (శ్రీలీల)ను ప్రేమిస్తాడు రమణ.
ఇంతకీ వసుంధర తన భర్త, కొడుకును ఎందుకు వదిలేసింది? దాని గురించి రమణ ఏం చేసాడు? అన్నది తెరమీద చూడాలి.
నటీనటులు:
గుంటూరు కారం అంటే మహేష్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమాను మోయడం మహేష్ కు తలకు మించిన భారమే అయింది. అయినా కూడా మహేష్ తనవంతుగా ఆల్రౌండ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇందులో ఫ్యాన్స్ స్టఫ్ కు కూడా బాగానే అవకాశముంది. యాక్షన్ సీక్వెన్స్ లు, ఎమోషనల్ సీన్స్ ల మహేష్ పెర్ఫార్మన్స్ సూపర్. ముఖ్యంగా ఈ చిత్రంలో చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.
శ్రీలీల చూడటానికి బాగుంది. తన పాత్ర వరకూ బాగానే చేసింది. ఆమె డ్యాన్స్ ల పరంగా మరోసారి ఉత్తేజపరిచింది. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ లకు బలమైన పాత్రలు దక్కాయి. ఇక ఈశ్వరి రావు, రావు రమేష్, మురళి శర్మ, జయరాం, సునీల్, మీనాక్షి తమ పాత్రల మేరకు బాగా పెర్ఫర్మ్ చేసారు. ఇక కామెడీ విషయంలో అజయ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ లు ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. జగపతి బాబు పాత్ర వల్ల కథకు ఒరిగిందంటూ ఏం లేదు.
సాంకేతిక నిపుణులు:
మహేష్ ను ఎనర్జిటిక్ గా చూపించడంలో పెట్టిన శ్రద్ధ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో కూడా పెట్టి ఉండాల్సింది. స్టోరీ చాలా రొటీన్. ఇక నరేషన్ చాలా మటుకు ఫ్లాట్ గానే సాగింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. మహేష్ కనుక లేకపోయి ఉండుంటే గుంటూరు కారం డిజాస్టర్ అయ్యేది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మ్యూజిక్ పరంగా థమన్ నిరాశపరిచాడు. ఒకట్రెండు పాటలు పర్వాలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరీ ఇంప్రెసివ్ గా ఏం అనిపించదు. కొన్ని చోట్ల గందరగోళం కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు గ్రాండ్ గానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- మహేష్ బాబు పెర్ఫార్మన్స్
- శ్రీలీల
- క్లైమాక్స్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కమర్షియల్ టెంప్లెట్
- థమన్ వర్క్
- ఫ్లాట్ నరేషన్
విశ్లేషణ:
చాలా పలుచనైన కథ ఎంచుకున్నాడు గురూజీ. దానికి అంతే ఫ్లాట్ నరేషన్ ను జోడించాడు. ఈ సినిమాలో పాజిటివ్ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా మహేష్ బాబు పెర్ఫార్మన్స్. తన ఎనర్జీ ఈ సినిమాను ముందుకి నడిపిస్తుంది. అటు ఫస్ట్ హాఫ్ లోనూ, ఇటు సెకండ్ హాఫ్ లోనూ కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. డైలాగ్స్, ఎమోషన్స్ పరంగా త్రివిక్రమ్ తడబడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి వచ్చిన యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా నడిచేయొచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5