Switch to English

హను-మ్యాన్ మూవీ రివ్యూ – ఇంప్రెసివ్ సూపర్ హీరో ఫిల్మ్

Critic Rating
( 3.25 )
User Rating
( 3.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow
Movie హను మ్యాన్
Star Cast తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్
Director ప్రశాంత్ వర్మ
Producer నిరంజన్ రెడ్డి కందగట్ల
Music అనుదీప్ దేవ్, గౌరాహరి కృష్ణ సౌరభ్
Run Time 12 జనవరి 2024
Release 2 గం 38 నిమిషాలు

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం హను-మ్యాన్. తేజ సజ్జ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో కనిపించాడు. ప్రోమోల దగ్గరనుండి హను-మ్యాన్ ఇంప్రెస్ చేస్తూ వచ్చింది. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

అంజనాద్రి అనే ఊరిలో ఒక దుర్మార్గుడి వల్ల అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు హనుమంతు (తేజ సజ్జ). తన అక్క (వరలక్ష్మి శరత్ కుమార్) తో కలిసి ఉండే హనుమంతుకి మీనాక్షి (అమృత అయ్యర్) అంటే చాలా ఇష్టం.

ఒకానొక సంఘటనలో మీనాక్షి ను ఆపద నుండి కాపాడే క్రమంలో హనుమంతు సూపర్ హీరో అయ్యే విధంగా హనుమంతుడి శక్తులన్నీ తనకు వస్తాయి. అలా ఎలా జరుగుతుంది? దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి?

నటీనటులు:

హనుమంతుగా తేజ సజ్జ పెర్ఫార్మన్స్ సూపర్. తన కెరీర్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలు చేసిన తేజ, ఈ సినిమాతో పరిణితి చెందిన నటుడిగా కనిపిస్తాడు. యాక్షన్, కామెడీ, డ్రామా… ఇలా జోనర్ ఏదైనా హను-మ్యాన్ లో తేజ సజ్జ సులువుగా ఒదిగిపోయాడు.

అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగానే చేసింది. ఎక్కువగా విలన్ పాత్రలు చేసే ఆమెకు ఇది కొంచెం భిన్నమైన పాత్ర అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో ఆమెకు ది బెస్ట్ మూమెంట్ పడిందని చెప్పొచ్చు. హనుమంతు ప్రియురాలిగా అమృత అయ్యర్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

సూపర్ విలన్ గా వినయ్ రాయ్ కూడా సూపర్. లుక్స్ పరంగా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక సైంటిస్ట్ గా వెన్నెల కిషోర్ సర్ప్రైజ్ చేస్తాడు. ఇక కామెడీ పరంగా గెటప్ శ్రీను, సత్యలు ఇంప్రెస్ చేస్తారు.

సాంకేతిక నిపుణులు:

కథ మూలం రొటీన్ అయినా, హను-మ్యాన్ స్క్రీన్ ప్లే ఇంప్రెసివ్ గా సాగుతుంది. పౌరాణిక సూపర్ హీరో పాత్రకు, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీలను జోడించిన విధానం సూపర్బ్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా సినిమాకు తగ్గట్లుగా సాగాయి. అక్కడక్కడా కొంచెం ల్యాగ్స్ ఉన్నా కానీ మొత్తంగా సినిమా మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. ఈ కథలోకి కోతి పాత్ర (దానికి రవితేజ డబ్బింగ్) జొప్పించి విధానం బట్టి అర్ధం చేసుకోవచ్చు రైటింగ్ ఎంత పకడ్బందీగా సాగిందని.

దర్శకత్వ పరంగా ప్రశాంత్ వర్మ ఇంప్రెస్ చేసాడు. చాలా చోట్ల డైరెక్షన్ ఫస్ట్ రేట్ గా సాగింది. అటు దేవుడైన హనుమంతుడిని, సూపర్ హీరోకి కనెక్ట్ చేసిన విధానం మెయిన్ గా ఇంప్రెస్ చేస్తుంది. దాశరధి శివేంద్ర అందించిన సినిమాటోగ్రఫీ వర్క్ సూపర్బ్. సాయి బాబు తలారి ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. అయితే కనీసం 10 నిముషాలు ట్రిమ్ చేసే అవకాశముంది. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ అందించిన సంగీతం సూపర్బ్ అని చెప్పాలి. ముఖ్యంగా గౌర హరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంప్రెస్ చేస్తుంది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. అంత తక్కువ బడ్జెట్ లో ఆ రేంజ్ విజువల్స్ ఎలా సాధించారో దర్శకుడే చెప్పాలి. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

  • తేజ సజ్జ పెర్ఫార్మన్స్
  • హనుమంతుడి రిఫరెన్స్ ఉన్న సీన్స్
  • ఇంటర్వెల్ ఎపిసోడ్
  • సూపర్ హీరో కాన్సెప్ట్
  • క్లీన్ కామెడీ
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • విఎఫ్ఎక్స్

మైనస్ పాయింట్స్:

  • మిడిల్ పోర్షన్స్ లో డ్రాగ్
  • ప్రీక్లైమాక్స్ సీక్వెన్స్
  • రిపీట్ గా అనిపించే విలన్ ఎపిసోడ్స్

విశ్లేషణ:

ఈ సంక్రాంతికి చూడాల్సిన పెర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ హను-మ్యాన్. పెద్దల కన్నా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే అంశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడా కొంచెం డ్రాగ్ తప్పించి ఈ సినిమా విషయంలో పెద్ద కంప్లైంట్స్ అంటూ ఏం లేవు. హ్యాపీగా ఈ సంక్రాంతి మీ కుటుంబంతో కలిసి హను-మ్యాన్ తో ఎంజాయ్ చేయండి

తెలుగు బులెటిన్ రేటింగ్: 3.25/5

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు. సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా...

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...

ఎక్కువ చదివినవి

జయకేతనం.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై జనసేనాని సంతకం.!

రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

బలహీన వర్గాలకే టీడీపీ పెద్దపీట..!

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు జనసేన, బీజేపీలకు కేటాయించగా మిగిలిన 3 సీట్లకు గాను టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన...

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ షూటింగ్ విజువల్స్ లీక్.. చర్యలకు దిగిన టీమ్

SSMB29: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ నటులు సినిమాలో నటిస్తున్నట్టు...

టచ్ చేశావ్ కిరణ్..!

తను ఎదుగుతూ మరో పదిమంది ఎదగడానికి సహాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తాను అనుభవించిన కష్టం తెలుసు కాబట్టి మరొకరు ఆ కష్టం పడకుండా ఉండేందుకు బాసటగా నిలబడటం అద్భుతమైన...