Switch to English

గ్రౌండ్ రిపోర్ట్: అసలు ‘వాలంటీర్’ మనసులో ఏముంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చీకటితోనే బయల్దేరి.. చీకటయ్యాక.. ఇంటికి వెళ్ళడం ‘వాలంటీర్’కి అలవాటే.! ప్రతిరోజూ ఇదే పని కాదు.! పెన్షన్ల పంపిణీ.. అదో పెద్ద తతంగం.! సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ధృవీకరణ, తదితర వ్యవహారాల నిమిత్తం.. కాస్త గట్టిగానే కష్టపడాలి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ వాలంటీర్ వ్యవస్థ తెరపైకొచ్చింది. గౌరవ వేతనం.. అంటూ, చేతికి ఎంతో కొంత ఇచ్చి యువతను, ఈ వాలంటీర్ పోస్టుల కోసం వైసీపీ సర్కారు నియమించింది.

ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరుగుతున్నాయంటే, ఆ వ్యవస్థకు చట్టబద్ధత వుండాలి.! ఏ శాఖలో అయినా ఉద్యోగి తప్పు చేస్తే, ఆ శాఖ నుంచి పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. మరి, వాలంటీర్ తప్పు చేస్తేనో.? ప్చ్.. ఏ శాఖ తరఫున ఎలాంటి విచారణ వుంటుందో ఎవరికీ తెలియదు.

మొదటి నుంచీ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలొస్తూనే వున్నాయి. ఆ విమర్శలకు కారణం, ‘వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే’ అని వైసీపీ నేతలు, అందునా మంత్రులు పరకటిస్తూ వస్తుండడమే. ఎన్నికల ముందర, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని ప్రకటించడం గమనార్హం.

సో, ఎన్నికల వేళ వాలంటీర్లను, ఎన్నికల విధుల నుంచి దూరంగా వుంచాలనే డిమాండ్ తెరపైకి రావడం సహజమే కదా.! దానికి తోడు, ఎన్నికల సమయంలో వాలంటీర్లు, సామాజిక పెన్షన్లు పంచడంపైనా నిషేధం తెరపైకొచ్చింది. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనూహ్యమైన రీతిలో రచ్చ చేసింది.

పెన్షన్లు ఇంటి వద్ద పంచకపోవడంతో, 31 మంది వృద్ధులు మరణించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోపించడంతో, వాలంటీర్ వ్యవస్థ షాక్‌కి గురయ్యింది. పొరుగు రాష్ట్రాల్లోనూ సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. అక్కడెక్కడా వాలంటీర్ వ్యవస్థ లేదు. అక్కడెలాంటి మరణాలూ చోటు చేసుకోలేదు.!

కేవలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే సామాజిక పెన్షన్లు ఇంటి వద్ద అందకపోవడం వల్ల వృద్ధులు ప్రాణాలు కోల్పోవడమేంటి.? ఈ విషయమై వాలంటీర్లే ఆందోళన చెందుతున్నారు. ఇంకోపక్క, ఎన్నికల సమయంలో తమపై వేటు పడిందంటే, అసలు తమ వ్యవస్థకు చట్టబద్ధత ఎక్కడుందన్న వివేకం వాలంటీర్లలో పెరిగింది.

ఇన్నాళ్ళూ వైసీపీ అవసరాల కోసం తమను వాడుకుందనీ, ఇప్పుడు వృద్ధుల మరణాలంటూ వైసీపీ కొత్త వాదనకు తెరలేపిందనీ, కొన్ని చోట్ల బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీయకుండా, వాలంటీర్లను తప్పు పడుతుండడం బాధాకరమనీ, వాలంటీర్లు ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారు.

‘మేమూ రాష్ట్ర పౌరులమే. మాకూ బాధ్యత వుంది. వైసీపీ కార్యకర్తల్లో చాలామందికి వాలంటీర్ పోస్టులు వచ్చి వుండొచ్చు. వేరే గతిలేక, ఉపాధికోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళలేక వాలంటీర్ పోస్టుల్లో కొనసాగుతున్నాం.. మా మీద రాజకీయ ముద్ర వేయడం బాధాకరం..’ అని కొందరు వాలంటీర్లు వైసీపీ మీద మండిపడుతున్నారు.

‘కొందరు వాలంటీర్లు అసలెందుకు రాజీనామా చేశారో మాకు అర్థం కావడంలేదు. ఆ రాజీనామాల ప్రభావం అందరి మీదా పడుతోంది.. ప్రజల దృష్టిలో పలచనైపోతున్నాం..’ అన్నది సదరు వాలంటీర్ల ఆవేదనగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, ఏ కారణంతో ఎవరు చనిపోయినా, అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి తమకు పంపాలని వైసీపీ నేతలు హుకూం జారీ చేయడం పట్ల వాలంటీర్లుగా పనిచేస్తున్నవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘పైకి చెబితే, మా మీద భౌతిక దాడులూ జరుగుతాయ్.. అందుకే, ఏ విషయమూ పైకి చెప్పలేకపోతున్నాం..’ అన్నది మెజార్టీ వాలంటీర్ల ఆవేదన. ఇదీ, వాలంటీర్ వ్యవస్థ మీద వైసీపీ పెత్తనం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...