ప్రతి రోజు కోట్లాది మంది గూగుల్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ వాడేవారు, గూగుల్ సెర్చ్ ఇంజిన్ను ఉపయోగించే వారు ఇంకా గూగుల్ ఇతర సేవలను ఉపయోగించే వారికి మొన్న సోమవారం నాడు షాక్ తగిలింది. దాదాపుగా ముప్పావు గంట పాటు గూగుల్ డౌన్ అవ్వడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అంతా కూడా అవాక్కయ్యారు. గూగుల్ ను ఎవరైనా హ్యాక్ చేశారా అంటూ వార్తలు వచ్చాయి. 47 నిమిషాల తర్వాత మళ్లీ గూగుల్ యథావిథిగా పని చేయడం మొదలు పెట్టింది.
గూగుల్ ఆ రోజు డౌన్ అవ్వడంకు కారణం ఏంటీ అనే విషయమై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా గూగుల్ ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. హ్యాకింగ్ వార్తలు అన్ని కూడా ఫేక్ అని నిర్థారించింది. స్టోరేజీ టెక్నికల్ సమస్య వల్లే డౌన్ అయినట్లుగా పేర్కొన్నారు. గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ ఇంక్ వద్ద ఉన్న టూల్స్ ను ఈ ఏడాది అక్టోబర్ లో కొత్త ఫైల్ స్టోరేజీకి మార్చడం మొదలు పెట్టారు. ఆ పక్రియ కాస్త తప్పుగా జరగడం వల్లే ఆ రోజు గూగుల్ నిలిచి పోయిందని అధికారికంగా ప్రకటించారు.
370966 46593Soon after study many with the content material inside your web internet site now, and i also truly much like your way of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls take a appear at my web page also and inform me how you feel. 404172
41304 932038I gotta favorite this web web site it seems very beneficial . 534113
360703 991084Great post, Im looking forward to hear a lot more from you!! 537142