బంగారాన్ని చూస్తేనే కళ్లు మిరుమిట్లు గొలుపుతుంది. అటువంటిది ఓ బంగారం కొండే కనిపిస్తే అద్భుతమే కదా. సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగోలో ఇదే జరిగింది. ఏకంగా అక్కడ ఓ బంగారం ఉన్న కొండే వెలుగుచూసింది. దీంతో ఆ ప్రాంతవాసులు బంగారం తవ్వుకునేందుకు చేతికి అందిన వస్తువులు లేదంటే చేతులతోనే బంగారం కోసం తవ్వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ కాంగో ప్రాంతంలోని దక్షిణ కివు ఫ్రావిన్స్ లుహిహిలో ఓ బంగారు కొండ బయల్పడింది.
ఆ కొండలో దాదాపు 60 నుంచి 90 శాతం వరకూ బంగారం ఉందనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతంలోని వారు కొండను తవ్వేస్తున్నారు. ఆ వీడియోను ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆఫ్రికా ఖండంలో ఉన్న పేద దేశాల్లో కాంగో ఒకటి.
The moment of washing the dirt and extracting the gold. #Congo pic.twitter.com/7L1V1Clm30
— Ahmad Algohbary (@AhmadAlgohbary) March 2, 2021
662677 498391I dont normally have a look at these kinds of web sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was definitely a bit excited as properly. Thanks for giving me a big smile for the day 572017
693986 375177Woh I like your articles , saved to fav! . 987282