Switch to English

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే వుండదా.? ఆ హీరో, ఈ హీరో అని లేదు.. దాదాపు అందరు హీరోల అభిమానుల్లోనూ ఇలాంటోళ్ళుంటారు.

కాకపోతే, అల్లు అర్జున్ అభిమానుల పేరుతో ఇప్పుడు, అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని మూకలు.! కొద్ది రోజుల క్రితం జనసేన నేత నాగబాబు ఓ ట్వీటేశారు. మన మంచి కోరేవాళ్ళు పరాయివాళ్ళే అయినా మనవాళ్ళు.. మన చెడు కోరుకునేవాళ్ళు మనవాళ్ళే అయినా పరాయివాళ్ళు.. అన్నది ఆ ట్వీటు సారాంశం.

ఇంకేముంది.? సోకాల్డ్ అల్లు అర్జున్ అభిమానులు నిస్సిగ్గుగా భుజాలు తడిమేసుకున్నారు. పోతిన మహేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటోళ్ళని ఉద్దేశించి నాగబాబు ట్వీటేశారన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. జనసైనికులు కూడా, ఆ దిశగానే స్పందించారు. నాగబాబు ట్వీటుని సమర్థించారు.

కానీ, ఇటీవల ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో, అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి, వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. పిఠాపురం వెళ్ళి జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మద్దతివ్వకుండా, జనసేన రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడమేంటని పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకింత గుర్రుగా వున్నారు.
ఆ ఫ్యాన్ వార్ జరుగుతున్న సమయంలోనే నాగబాబు ట్వీటొచ్చింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని గెలుపు కోసం టీడీపీ నేత వర్మ చేసిన కృషిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, పోతిన మహేష్ లాంటోళ్ళనీ పోల్చుతూ.. చేసిన ట్వీట్ అది.
కానీ, డ్యామేజ్ వేరే లెవల్‌లో జరిగిపోయింది. అల్లు అర్జున్ అభిమానులు బూతులు తిడితే, నాగబాబు దిగొస్తారని అనుకోలేం. కాకపోతే, చిరాకు.. అసహ్యం.. అత్యంత జుగుప్సాకరమైన బూతులతో అల్లు అర్జున్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలోనే నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ డీ-యాక్టివేట్ అయినట్లు కనిపిస్తోంది.
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్‌లో ఎలాంటి పోస్టులూ కనిపించడం లేదు. నడుస్తున్న గొడవకి ముగింపు పలికేందుకు, మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి నాగబాబుకి వార్నింగ్ ఇచ్చారనీ, అల్లు అర్జున్ తీరు విషయంలోనూ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారనీ, ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ డీ-యాక్టివేట్ అయ్యిందనీ ఓ సెక్షన్ మీడియా, మసాలా దట్టించిన కథనాల్ని వండి వడ్డించేస్తోంది.

ఇంత జరుగుతున్నా, అల్లు అర్జున్ ఎందుకు తన ఆర్మీని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నాడన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న తతంగం కాదు. అల్లు అర్జున్ ఆర్మీ ముసుగులో చిరంజీవిని, రామ్ చరణ్‌ని ట్రోల్ చేస్తున్నాయి కొన్ని మూకలు.

రానున్న రోజుల్లో ఈ మూకలే అల్లు అర్జున్‌కి శతృవులుగా మారే ప్రమాదం లేకపోలేదు.!

1 COMMENT

  1. With havin so much content and articles do you ever run into
    any problems of plagorism or copyright violation? My blog has a lot of unique content I’ve either authored myself or outsourced but it appears a lot of
    it is popping it up all over the web without my agreement.
    Do you know any ways to help prevent content
    from being ripped off? I’d genuinely appreciate it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘విశిష్ట అతిథి’.. తెలుగు రాష్ట్రాల్లో ‘చిరంజీవి’కాక మరెవరు..

Chiranjeevi: కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే.. స్టేట్ గెస్ట్ గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయనెంత ప్రముఖడై ఉండాలి. ఎంతటి సుమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి....

Vishnu Priya: విష్ణుప్రియ హాట్ హాట్ .. ధూపం పెట్టి మరీ...

Vishnu Priya: అందాల భామలు బోల్డ్ ఫొటోషూట్స్ చేయడం కామన్. గ్లామర్ ఫీల్డ్ లో కావాలసినంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో పాపులర్.. మోడలింగ్,...

యంగ్ హీరోతో హీరో అర్జున్ కూతురి వివాహం..

స్టార్ యాక్షన్ హీరో అర్జున్( Arjun Sarja) కూతురు ఐశ్వర్య(Aishwarya Arjun) వివాహం.. ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఘనంగా...

Bunny Vas birthday special: సినిమాపై ప్రేమ, ఇష్టం.. అదే నిర్మాత...

Bunny Vas: సినిమాపై ప్రేమ.. ఇష్టం.. ఆయన్ను ప్రేక్షకుడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానం ఆయన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది....

Prabhas : ‘కల్కి’ కోసం చంద్రబాబు వద్దకు టీం..!

Prabhas : ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్‌ లుగా అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు...

రాజకీయం

పోయినోళ్ళంతా మంచోళ్ళే.! రామోజీ కూడా అంతే.!

పెద్దలు ఓ మాట చెబుతుంటారు.. ‘పోయినోళ్ళంతా మంచోళ్ళే’ అని.! అలాగని, పోయినోళ్ళంతా మంచోళ్ళే అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే, ‘పోయారు’ కదా, వాళ్ళ గురించి ‘మంచి’ మాట్లాడుకోవడం బెటర్.! వాళ్ళు చేసిన...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం...

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

Pawan Kalyan: పవన్ కు 10ఏళ్ల సెంటిమెంట్..! అక్కడా.. ఇక్కడా కొట్టింది కుంభస్థలాన్నే..

Pawan Kalyan: ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’నేది ఓ మాట. దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాల్లో ఆయన క్రేజ్ ఎవరికీ అందదు. వరుసగా 10ఏళ్లు ఫ్లాపులు...

జనసేనపై వైసీపీ ‘జేజేఎస్పీ’ కుట్రలు బహిర్గతం.!

జనసేన పార్టీని దెబ్బ తీసే క్రమంలో, ‘జాతీయ జన సేన పార్టీ’ని తెరపైకి తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ జన సేన పార్టీ ఏంటో, ఆ పార్టీ నాయుకులెవరో.. ఎవరికీ తెలియదు....

వైసీపీ కార్యకర్తలు వర్సెస్ వాలంటీర్లు.. పార్టీ ఓటమికి కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 'వై నాట్ 175' అన్న నినాదంతో ఎన్నికల్లోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ పరాజయానికి కారణాలు...

Pawan Kalyan : పవన్ మీద ఆశలు వదిలేసినట్లేనా…?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రెండు సినిమాలను పూర్తి చేశాడు. ఇంకా హరి హర వీరమల్లు, ఓజీ...