Switch to English

ఏపీలో కరోనాపై పోరు: మాస్కులడిగితే ‘వేటు’ వేసుడే.!

జనం మాస్కులు వేసుకోకపోతే వెయ్యి రూపాయల జరీమానా.. మరి, జనం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అధికారుల పరిస్థితేంటి.? వాళ్ళుగనుక ‘మాస్కులు లేవు’ అని అడిగితే, ‘వేటు’ పడటం ఖాయం. ఇదీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. మొన్న విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు సుధాకర్‌, ఆసుపత్రుల్లో మాస్కులు లేకపోవడంపై స్పందిస్తే, టీడీపీకి లింకు అంటగట్టి ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

తాజాగా, చిత్తూరు జిల్లా నగిరి మునిసిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డిపైనా వేటు పడేలా వుంది. ఎందుకంటే, ఆయనా అదే ‘పెద్ద’ తప్పు చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్న తమకు మాస్కులు అందించడంలేదనీ, అయినాసరే నగిరిలో పోలీసులు, అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారనీ, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని వాపోతూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

రాష్ట్రంలో అన్ని చోట్లా పరిస్థితి ఇలాగే వుందని చెప్పలేంగానీ, చాలా చోట్లు వైద్యులకు సరిపడా ‘ప్రొటెక్షన్‌’ కిట్స్‌ వుండడంలేదన్నది నిర్వివాదాంశం. ఇటీవల గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఓ వైద్యుడు, తమకు మాస్కుల కొరత వుందనీ, ఈ పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం చేయడం చాలా కష్టంగా మారిందని వాపోవడమే కాదు, దాతలు ఆదుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ వ్యవహారంపై ఆ నోటా ఈనోటా సమాచారం తెలుసుకున్న సినీ నటుడు నిఖిల్‌, తనకు చేతనైన స్థాయిలో సాయం చేశాడు. మరికొందరు దాతలూ ముందుకొచ్చారు. అయినా, వైద్యులకు ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ లేకుండా వైద్యం ఎలా చేస్తారు.? ఈ మాత్రం ఇంగితం లేకుండా ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది.?

అవును మరి, అధికార పార్టీ నేతలు జనంలో విచ్చలవిడిగా తిరిగేస్తూ, ఈ క్రమంలో మాస్కుల్ని అడ్డగోలుగా వినియోగిస్తున్నారు. పోనీ, అవన్నా సక్రమంగా వినియోగిస్తున్నారా.? అంటే, ఫొటోలకు పోజులివ్వాల్సిన క్రమంలో వాటిని తీసి పక్కన పడేస్తుండడం గమనార్హం.

ఓ పక్క కరోనా దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతోంటే, అధికార పార్టీ నేతలకు ‘రిబ్బన్‌ కటింగులు’ అవసరమయ్యాయి. మంత్రుల తీరు మరీ దారుణంగా తయారైంది. తాము ఎదుర్కొంటోన్న దుస్థితిని అధికారులు చెప్పుకుంటోంటే, వారిపై ‘వేటు’ వేసి, చేతులు దులుపుకుంటోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. పారాసిటమాల్‌ చాలు.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే మేలు.. అని ముఖ్యమంత్రి మొదట్లో సెలవిచ్చారుగానీ.. ఆ నిర్లక్ష్యం ఖరీదు ఇప్పుడు 400 దిశగా దూసుకుపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. వాటిల్లో ఇప్పటికే సంభవించిన ఆరు మరణాలూ.!

April 7 : డాక్టర్స్ కు మాస్కులు ఇవ్వట్లేదని దళిత డాక్టర్ సుధాకర్ ఆవేదన. April 8 : ప్రభుత్వానికి వ్యతిరేకం గా మాట్లాడాడని దళిత డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. April 9 : ఈ వీడియో లో వున్నది చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం నుండి మాకు చిల్లి గవ్వ రాలేదు, మాకు మాస్కులు ఇవ్వలేదు, బూట్లు, గ్లోవ్స్ ఇవ్వలేదు అంటున్నారు..

Geplaatst door VK Ramabrahmam Kaza op Donderdag 9 april 2020

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

క్రైమ్ న్యూస్: పూడ్చి పెట్టిన బాలిక శవం తీసి రేప్ చేసిన వృద్ధుడు

దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎంతగా కఠిన శిక్షలు విధిస్తున్నా, ఉరి శిక్షలు అమలు చేస్తున్న కూడా నిచులు తమ. బుద్దిని...

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...

ఫ్లాష్ న్యూస్: డీసీపీపై 500 మంది కానిస్టేబుల్స్‌ దాడి

ఈ విపత్తు సమయంలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీ నిర్వహిస్తున్నారు. వారికి అవసరం అయిన మాస్క్‌లు మరియు శానిటైజర్స్‌ కూడా కొన్ని చోట్ల ఇవ్వడం లేదు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో...