ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడడమే కాకుండా పర్సనల్ విషయాలపై కూడా ఓపెనప్ అయ్యాడు. ముఖ్యంగా తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. దాని వెనుక జరిగింది ఏంటి అన్నది కూడా చెప్పుకొచ్చాడు.
“నాకు 47 ఏళ్ల వయసులో నా భార్య అనిత చనిపోయింది. నేను మొదటి నుండి ఫ్యామిలీ మ్యాన్ ని. సాయంత్రం అయితే ఇంటికి వచ్చేయాలి అన్నది నా పద్దతి. అలాంటిది నా భార్య చనిపోయాక ఎమోషనల్ గా చాలా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైయింది. అనిత వెళ్ళిపోయాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆ లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్ళీ పెళ్లి చేయాలని మా అమ్మ, నాన్న నిర్ణయించారు. నా కూతురు కూడా ఓటు వేసింది. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పుష్ చేసారు. కొన్ని ఆప్షన్స్ అనుకున్నాక వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అన్నీ మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నాం. నాకు కొడుకు పుట్టాడు. ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా అన్వయ్ అని పెట్టుకున్నాం. అంతా హ్యాపీ,” అని చెప్పుకొచ్చాడు.