రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం షూటింగ్ గత ఏడాదిలోనే ఆరంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా మహమ్మారి కారణంగా మళ్లీ మొదటికి పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందబోతున్న పుష్ప చిత్రం షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ను రెడీ చేశాడట. సినిమాలోని ఆరు పాటలకు గాను ట్యూన్స్ ను సిద్దం చేసి సుకుమార్ మరియు బన్నీతో ఓకే చెప్పించాడట. సినిమాలోని మాస్ ఐటెం సాంగ్ ట్యూన్ బన్నీకి చాలా నచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఈ లాక్ డౌన్ టైమ్ మొత్తం కూడా పుష్ప కోసమే దేవిశ్రీ కేటాయించినట్లుగా తెలుస్తోంది.
ఈమద్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాలు సంగీతాల విషయంలో పోటీ పడ్డాయి. అయితే ఆ పోటీలో దేవిశ్రీ ప్రసాద్ పై థమన్ పై చేయి సాధించాడు. ఆ కసితో ఇప్పుడు పుష్ప కోసం అద్బుతమైన ట్యూన్స్ ను రెడీ చేశాడనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు.
418676 243962I likewise conceive so , perfectly written post! . 300959
552998 357446Keep up the wonderful piece of work, I read few posts on this internet internet site and I believe that your blog is really intriguing and holds bands of great information. 302685
155541 740589Oh my goodness! an exceptional post dude. Thanks a good deal Even so Im experiencing issue with ur rss . Do not know why Struggle to register for it. Can there be any person locating identical rss issue? Anyone who knows kindly respond. Thnkx 877359