Switch to English

రాజ్యసభకు వెళ్ళే అర్హత, దళితులకి, మైనార్టీలకీ లేదా.?

‘నాలుగు రాజ్య సభ సీట్లలో రెండిటిని మేం బీసీలకు ఇచ్చాం. యాభై శాతం కోటా బీసీల విషయంలో అమలు చేస్తున్న పార్టీ వైసీపీ మాత్రమే..’ అని వైసీపీ ఘనంగా చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. నిజమే, వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుల కోటాలో బీసీలకు  అవకాశం దక్కుతున్నమాటని ఎవరూ కాదనలేరు. అయితే, ఇక్కడ బీసీ కోటాలో ఎవర్ని రాజ్యసభకు పంపుతున్నారన్నదే కీలకం. సరే, ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని ‘అవసరాలు’ వుంటాయి, వాటికి తగ్గట్టే రాజ్యసభ సభ్యుల ఎంపిక వుంటుంది. వైసీపీ కూడా అదే చేస్తోంది.

అయితే, మైనార్టీల సంగతేంటి.? దళితుల మాటేమిటి.. ఇతర సామాజిక వర్గాల సంగతేంటి.? రెండు సీట్లు బీసీలకి, రెండు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకునే బదులు, ఓ మైనార్టీకీ, ఓ దళిత వ్యక్తికీ రాజ్యసభ అవకాశాన్ని కల్పించొచ్చు కదా.? అన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ.

‘వస్తాయ్.. ముందు ముందు వాళ్ళకీ వస్తాయ్..’ అని వైసీపీ చెబుతోంది. గతంలో అయినా, ఇప్పుడు అయినా, రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీలో అగ్రస్థానం అన్నది ఓపెన్ సీక్రెట్. మంత్రి వర్గంలో సామాజిక న్యాయం.. అని వైసీపీ చెబుతున్నప్పటికీ, పెత్తనమంతా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోనే వుంది’ అనే విమర్శని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.

హోం శాఖ దగ్గర్నుంచి, అన్ని వ్యవహారాలపైనా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు, వివరాలు చెబుతారు తప్ప, సంబంధిత మంత్రుల స్పందన తగినంత వివరణాత్మకంగా కనిపించదు.

రాజ్యసభ సభ్యుల విషయానికొస్తే, రాజ్యసభకు వెళుతున్న వైసీపీ ఎంపీల్లో ఎంతమంది రాష్ట్రం తరఫున ప్రత్యేక హోదా కావొచ్చు, ఇతర విషయాల్లో కావొచ్చు గట్టిగా కేంద్రాన్ని నిలదీయగలుగుతారు.?

మొత్తమ్మీద.. విజయసాయిరెడ్డికి రెండో సారి అవకాశమిచ్చిన వైసీపీ అధిష్టానం, ఆ స్థానంలో ఓ మైనార్టీని సమర్థ నాయకుడిగా చూడలేకపోవడం, ఓ దళిత నాయకుడ్ని సమర్థుడిగా చూడలేకపోవడం ఆశ్చర్యకరమే.

వైసీపీ చేసుకునే పబ్లిసిటీకీ, చేసే పనులకీ అస్సలు పొంతన వుండదని తాజాగా రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారంలో స్పష్టమైపోయింది. ఈ విషయమై వైసీపీలోనే అంతర్గతంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ‘మేమెవరం అర్హులుగా, సమర్థులుగా అధినేతకు కనిపించలేదా.?’ అని మైనార్టీ, దళిత నాయకులు వాపోతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎనర్జిటిక్ స్టార్ పై బేబమ్మ ప్రశంసలు

టాలీవుడ్‌ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. వచ్చే వారంలో విడుదల కాబోతున్న...

విషాదం.. టాలీవుడ్‌ ఎడిటర్ గౌతంరాజు మృతి

టాలీవుడ్‌ లో ఎడిటర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు గౌతమ్‌ రాజు. సినిమా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న గౌతమ్‌ రాజు ఏకంగా 800...

ఎఫ్‌ 3 ఫైనల్‌ వసూళ్ల లెక్కలు ఇవే

ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ఎఫ్ 3 సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. వెంకటేష్.. వరుణ్‌ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో తమన్నా.....

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య...

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి...

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి...

రాజకీయం

పెగాసస్ జాతర.! రాజకీయ రచ్చ మళ్ళీ మొదలైందహో.!

పెగాసస్.! ప్రపంచాన్ని కుదిపేసింది కొన్నాళ్ళ క్రితం. ఆ పైత్యం మన దేశంలోనూ ‘వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురైంది’ అన్న కోణంలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఇంతకీ, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ వాడిందా.?...

బీజేపీ దగ్గర రఘురామ పప్పులుడకట్లేదెందుకు.?

అసలేమయ్యింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి.? ఆయనకు బీజేపీతో సత్సంబంధాలే వున్నాయి కదా.! కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నహిత సంబంధాలు కూడా వున్నాయి కదా.? అయినాగానీ, ప్రధాని...

అప్పట్లో బాలయ్య తన కష్టార్జితమన్నాడే.! గుర్తుందా యెల్లో బ్యాచ్.!

‘అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని పిలవడమేంటి.?’ అంటూ చాలా బాధపడిపోతోంది యెల్లో బ్యాచ్. టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ఈ విషయమై చేస్తున్న యాగీ...

టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి.! ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి.?

మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమకి పెద్దన్న.! ఔను, ఆయనే ఇప్పుడు తెలుగు సినిమాకి గాడ్ ఫాదర్.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. అబ్బే, ‘ఆచార్య’ సినిమాతో ఫ్లాప్ కొట్టారు...

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: సోమవారం 04 జూలై 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం సూర్యోదయం: ఉ.5:34 సూర్యాస్తమయం: సా.6:38 తిథి: ఆషాఢ శుద్ధ పంచమి సా.2:37 వరకు తదుపరి ఆషాఢ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: మఘ...

కేసీఆర్‌, మోడీ స్నేహంకు ఇదే సాక్ష్యం : రేవంత్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఎత్తక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్‌ ను టార్గెట్‌...

ఉయద్‌పూర్ హంతకుడు హైదరాబాద్‌లో…!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్‌ హత్య కేసు నింధితుడిని హైదరాబాద్‌ లోని పాతబస్తీలో తల దాచుకుని ఉండగా అరెస్ట్‌ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్ కు చెందిన టైలర్ కన్నయ్య...

పక్కా కమర్షియల్ రివ్యూ: కమర్షియల్ ఎంటర్టైనర్

ఎంతో కాలం నుండి హిట్ లేకుండా ఉన్న గోపీచంద్, విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో జట్టుకట్టాడు. మంచి బజ్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది పక్కా కమర్షియల్. మరి ఈ సినిమా...

మెగా ‘గాడ్‌ఫాదర్‌’ పుకార్లకు చెక్‌

మెగాస్టార్‌ చిరంజీవి 104వ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.. కాని అంతకు ముందు ప్రారంభం అయిన గాడ్ ఫాదర్‌ సినిమా యొక్క అప్డేట్ రాలేదు. అసలు సినిమా ఎప్పుడు విడుదల...