Switch to English

కేసీయార్‌తో విజయ్ భేటీ వెనుక రాజకీయ కోణం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

ప్రముఖ తమిళ సినీ నటుడు ‘దళపతి’ విజయ్, హైద్రాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఓ సినీ నటుడు, ఓ ముఖ్యమంత్రిని కలవడంలో వింతేముంది.? అంటే, ఆయన తమిళ నటుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు.! అదీ ఆసక్తికరమైన చర్చకు కారణమైన వ్యవహారం.

తమిళ నటుడు విజయ్ – తమిళనాడు బీజేపీ మధ్య చాలా కాలంగా యాగీ జరుగుతోంది. విజయ్‌ ఏ మతస్తుడు అన్నదానిపై తమిళనాడు బీజేపీ చేసే యాగీ అంతా ఇంతా కాదు. విజయ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. విజయ్ ఏ రాజకీయ పార్టీకీ అనుకూలంగా మాట్లాడిందీ లేదు. కానీ, రాజకీయాల్లోకి ఆయన్ని లాగడమే కాదు, తీవ్రస్థాయి విమర్శలు విజయ్ మీద బీజేపీ చేస్తుంటుంది.

విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ ఆయన తండ్రి అడపా దడపా ప్రకటనలు చేస్తుంటాడు, ఆ ప్రకటల్ని విజయ్ ఖండిస్తుంటాడు కూడా.

ఈ నేపథ్యంలో, జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గురించి ఆలోచన చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, స్వయంగా విజయ్‌ని పిలిపించుకుని మాట్లాడారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుత రాజకీయాలపై విజయ్‌తో కేసీయార్ చర్చించారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విజయ్ తరఫున ఈ వ్యవహారంపై అధికారిక స్పందన రాలేదుగానీ, విజయ్ సన్నిహితులు మాత్రం.. సినిమా వ్యవహారాలపైనే విజయ్, కేసీయార్‌ని మర్యాదపూరక్వకంగా కలిశారని చెబుతున్నారట. బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీయార్ జత కట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్‌తో కేసీయార్ గతంలో మంతనాలు కూడా జరిపారు.

మరిప్పుడు, విజయ్ సంగతేంటి.? విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెడతారనే సమాచారం ఏమైనా కేసీయార్ వద్ద వుందా.? ‘మర్యాద పూర్వక భేటీ మాత్రమే.. ఎలాంటి రాజకీయాల్లేవు..’ అని అటు విజయ్ తరఫున, ఇటు కేసీయార్ తరఫున ప్రకటన వచ్చినా, ‘మహానుభావులు ఊరకనే కలవరు..’ అన్న చందాన, ఖచ్చితంగా పొలిటికల్ మేటర్ అయితే వుండి వుండాలి ఈ కలయిక వెనుక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...