Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 27 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:24
సూర్యాస్తమయం : సా‌.6:01
తిథి: మాఘ బహుళ ఏకాదశి ఉ.6:56 వరకు తదుపరి ద్వాదశి సోమవారం తె‌.4:28 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: భానువాసరః  (ఆదివారం)
నక్షత్రము : పూర్వాషాఢ ఉ.7:39 వరకు తదుపరి ఉత్తరాషాఢ సోమవారం ఉ.6:05 వరకు
యోగం: వ్యతీపాత మ.4:48 వరకు తదుపరి వరీయాన్
కరణం: బాలవ ఉ.6:56 వరకు
వర్జ్యం: మ.3:08 నుండి సా.4:37 వరకు
దుర్ముహూర్తం:సా.4:26 నుండి 5:11 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం: మ.3:23 నుండి సా.4:51 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:03 నుండి ఉ.5:51 వరకు
అమృతఘడియలు:రా.12:06 నుండి 1:36 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05 నుండి 12:52 వరకు

ఈరోజు (27-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

వృషభం: వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

మిథునం: నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. మిత్రులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం: ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల: సోదరుల నుండి శుభవర్తమానాలు అందుతాయి ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంట బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. వ్యాపార నిర్వహణలో లోపాలు అదిగామిస్తారు. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు.

ధనస్సు: నూతన విషయాలు పై దృష్టి సారిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

కుంభం: నూతన పనులకు శ్రీకారం చూడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమౌతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనాలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మీనం: ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి నిరుద్యోగులకు చాలకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆప్తుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...