Switch to English

సెక్స్ చేస్తూ చనిపోతే.. కంపెనీదే బాధ్యత!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఇదో విచిత్రమైన సంగతి. బిజినెస్ ట్రిప్ పై వెళ్లిన ఓ కంపెనీ ఉద్యోగి, అక్కడ వేరే మహిళతో శృంగారం చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు అతడికి పరిహారం ఎవరు చెల్లించాలి? కంపెనీ ట్రిప్ పై వెళ్లినందుకు కంపెనీ ఇవ్వాలా? సెక్స్ చేస్తూ చనిపోయినందున ఆ మహిళ బాధ్యురాలు అవుతుందా? లేక ఇది అతడి తప్పు కాబట్టి ఎవరికీ బాధ్యత లేదా? ఈ అంశంపై ఏకంగా ఆరేళ్లపాటు కోర్టులో వాద ప్రతివాదనలు సాగాయి.

తాజాగా కోర్టు ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఫ్రాన్స్ కి చెందిన టీఎస్ఓ అనే రైల్వే కనస్ట్రక్షన్ కంపెనీలో ఎం జేవియర్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారు. 2013లో కంపెనీ పని నిమిత్తం ఆయన లారియట్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బస చేసిన సందర్భంలో ఓ అపరిచితురాలైన మహిళతో సెక్స్ లో పాల్గొన్నారు. అయితే, శృంగారం చేస్తుండగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడికి టీఎస్ఓ ఎలాంటి పరిహారం చెల్లించలేదు. దీంతో అతడి కుటుంబం కోర్టుకెళ్లింది. జేవియర్ మరణం కంపెనీ పని మీద ఉన్నప్పుడు జరిగినందున కంపెనీయే పరిహారం చెల్లించాలని వాదించింది.

Also Read: అతి స్పందన.. ‘కోరిక’ ముదిరి.. ఆసుపత్రిలో చేరి..

అయితే, టీఎస్ఓ మాత్రం ఈ వాదనతో విభేదించింది. అతడు తన వ్యక్తిగత వాంఛ తీర్చుకోవడం కోసం శృంగారంలో పాల్గొన్నాడని, అందుకు కంపెనీ బాధ్యత వహించదని స్పష్టంచేసింది. పైగా అతడికి తాము కేటాయించిన హోటల్ లో కాకుండా వేరే హోటల్ లో ఈ సంఘటన చోటు చేసుకుందని, అందువల్ల తమకు ఎలాంటి సంబంధ లేదని పేర్కొంది. అంతేకాకుండా అతడు చేసిన పని వల్ల పర్యటన ఉద్దేశం కూడా ప్రభావితమైందని వాదించింది.

తాజాగా ఈ కేసులో న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. అది ముమ్మాటికీ పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంగానే అభివర్ణించారు. ‘‘శృంగారం కూడా రోజువారీ కార్యకలాపాల్లోకే వస్తుంది. ప్రతి రోజూ స్నానం చేయడం, భోజనం చేయడం వంటి కార్యకలాపాల కిందకే సెక్స్ కూడా వస్తుంది. దీని వల్ల అతడి ఉద్యోగ బాధ్యతలపై ఎలాంటి ప్రభావం పడదు’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...