Switch to English

పాజిటివ్‌లూ.. రికవరీలూ.. ఏపీలో కరోనా సరికొత్త రికార్డులూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేనా, రికార్డు స్థాయిలో రికవరీలు కూడా జరిగాయి. ఇంకా వుంది.. రికార్డు స్థాయిలో టెస్టులు కూడా చేయగలిగారు. కథ అప్పుడే అయిపోలేదు.. రికార్డు స్థాయిలో ఈ రోజు మరణాలు కూడా సంభవించాయి.

6045 కరోనా పాజిటివ్‌ కేసులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో నమోదు కాగా, విశాఖపట్నంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తొలిసారి వెయ్యి మార్కు దాటడం కూడా రికార్డే. రికవరీల విషయానికొస్తే, కొత్త పాజిటివ్‌ కేసుల కంటే ఎక్కువగా.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏకంగా 6494 మంది కరోనా నుంచి కోలుకోవడం చాలా చాలా గొప్ప విషయమే. అయితే, దురదృష్టకరం.. ఈ రోజు 62 మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య చాలా చాలా వేగంగా పెరుగుతోంది. వెయ్యి మరణాల మార్క్‌ దాటేయడానికి బహుశా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఇప్పటికే మరణాల సంఖ్య 828కి చేరుకుంది. ఒకే రోజులో మొత్తం 49,553 పరీక్షలు జరగడం కూడా ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్న ప్రభుత్వ వాదనని తప్పు పట్టలేం. కానీ, టెస్టుల పరంగా చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ చాలా యాక్టివ్‌గా వుంది. అయినా, కొత్తగా ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పైగా, విశాఖ కొద్ది రోజుల క్రితం 100 లోపు కేసులు నమోదవుతోంటే, ఇప్పుడు 1000కి పైగా కేసులు నమోదవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అత్యల్పంగా, అత్యధికంగా కేసులు కొన్ని జిల్లాల్లో కేవలం రోజుల వ్యవధిలో నమోదవుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘కరోనా కట్టడిలో మనం మిగతా రాష్ట్రాల కన్నా ముందున్నాం..’ అని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. కానీ, కేసులు పెరుగుతున్నాయి.. మరణాలూ పెరిగిపోతున్నాయి. కేసులు పెరిగినా, మరణాలు తగ్గించగలిగితే.. ప్రభుత్వ ప్రయత్నాలు సఫలమవుతున్నట్లు లెక్క. అధికార పార్టీకి చెందిన నేతలు కరోనా సోకితే వెంటనే హైద్రాబాద్‌కి తరలి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం.. ప్రభుత్వ సమర్థతపై విపక్షాలు ప్రశ్నాస్త్రాలు సంధించడానికి ఆస్కారం కల్పిస్తోందన్నది నిర్వివాదాంశం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...