Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ప్రేక్షకుల మనసుల్లో ‘మగమహారాజు’గా నిలిచిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

హీరో కావాలనే కల నుంచి మెగాస్టార్ గా తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసుకునే స్థాయికి చిరంజీవి వెళ్లారు. తొలి సినిమా నుంచి వేసే ప్రతి అడుగు తన కెరీర్ కు ఉపయోగపడేలా వేసుకున్న తీరే నేడు ఎందరికో ఆదర్శం అయింది. సినీ రంగంలోని నటులే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చిరంజీవి మాకు ఆదర్శం అన్నవారు ఉన్నారు. లక్ష్య సాధకుడు ఏం చేస్తాడో.. చేయాలో చిరంజీవి చేసి చూపించారు. అలా ఆయన వేసుకున్న దారిలో ఒక అద్భుతమైన అడుగు ‘మగమహారాజు’. మధ్యతరగతి కుటుంబంలో పెద్ద కొడుకుగా బరువు, బాధ్యతలు మోసే పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. సినిమాలో చిరంజీవి నటనలా కాకుండా జీవించడంతో ‘మగమహారాజు’కు ప్రేక్షకులు పట్టం కట్టారు.. సూపర్ హిట్ చేశారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్: ప్రేక్షకుల మనసుల్లో ‘మగమహారాజు’గా నిలిచిన చిరంజీవి

 

సినిమాకు అదే హైలైట్..

చిరంజీవి వ్యక్తిత్వానికి సినిమా టైటిల్ సరిపోయిందని చెప్పాలి. నిజజీవితంలోనూ చిరంజీవి ఇంట్లో పెద్ద కొడుకు. సినిమాలోనూ పెద్ద కొడుకే. తండ్రి తర్వాత కుటుంబానికి అతనే ధైర్యం. నిజజీవితంలోనూ చిరంజీవి ఇంటికి పెద్ద కొడుకే. సినిమాలో ఆ పాత్రకు ఫ్యామిలే ఎమోషన్స్, బాధ్యతలు ఎక్కువ. తోడబుట్టిన వారిని గాడిలో పెట్టాల్సిన అవసరం, చదువుకుని ఉద్యోగం చేసి ఇంటి కష్టాలను తీర్చే పాత్రలో చిరంజీవి నటించారు. డబ్బు అవసరమై ఏకబిగిన ఎనిమిది రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం సినిమాకే హైలైట్. ఆ సీన్ లో చిరంజీవి నటన, హావభావాలు రోజులు గడుస్తున్న కొద్దీ నీరసించి.. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చిరంజీవి నటన.. సినిమా అనే భావనే మరచిపోయి అభిమానులతో విజిల్స్.. మహిళలతో కంటతడి పెట్టేలా చేసింది.

 

నటనకు అవకాశమున్న పాత్రలో..

చిరంజీవి అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన డేట్స్ దొరకడం కష్టం. సినిమా హాట్ కేక్ లా అమ్ముడవుతోంది. యాక్షన్, డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో ఆగిపోతే ఆయన చిరంజీవి ఎలా అవుతారు. హీరోయిజమైనా, అమ్మాయిలను మోసం చేసే పాత్రయినా.. భార్యను హింసించే పాత్రైనా, మధ్యతరగతి కుటుంబంలో సామాన్యుడి పాత్రైనా చిరంజీవి సై అన్నారు. ఆయనకు కావల్సింది నటనలో వైవిధ్యం చూపించి ప్రేక్షకులను మెప్పించడం. కొన్ని ఫ్యామిలీ సినిమాలు చేసినా బాధ్యతలు మోసే కొడుకు పాత్ర ‘మగమహారాజు’తోనే జరిగింది. రాజు పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా ఎదగడమే కాకుండా.. ప్రేక్షకుల మనసుల్లో సుస్ధిర స్థానం ఏర్పరచుకునేలా చిరంజీవి అనుకున్నది సాధించారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్: ప్రేక్షకుల మనసుల్లో ‘మగమహారాజు’గా నిలిచిన చిరంజీవి

 

బాపినీడుపై నమ్మకం..

నిర్మాత, రచయిత విజయబాపినీడుకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. ఆయన సినిమాలు కుటుంబ నేపథ్యంలోనే ఉంటాయి. అందులో హీరో ఎలివేషన్ ఉంటుంది. మగమహారాజులో చిరంజీవి పాత్రను అలానే డిజైన్ చేశారు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను ఆసక్తిగా మలిచారు. ఆయన ఆలోచనలకు చిరంజీవి తన నటనతో ప్రాణం పోశారు. దర్శకుడిగా మౌళిని అనుకున్నా అనుకోని పరిస్థితుల్లో సినిమా ప్రారంభానికి రోజు ముందు చిరంజీవికి కూడా తెలీకుండా విజయబాపినీడు తనకు తానే దర్శకుడిగా మారిపోయారు. ఇది తెలిసి చిరంజీవి ఆశ్చర్యపోలేదు.. ‘గుడ్ లక్’ అన్నారు. చిరంజీవి నమ్మకాన్ని బాపినీడు నిలబెట్టుకున్నారు. అద్భుత విజయంతో 12 కేంద్రాల్లో సినిమా శతదినోత్సవం జరుపుకుంది.

120 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...