Switch to English

చంద్రన్న.. జగన్ మామ.! తర్వాతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అప్పట్లో చంద్రన్న కానుక.. ఇప్పుడేమో జగనన్న దీవెన.! జగనన్న గోరుముద్ద.. జగనన్న చిక్కీ.. జగనన్న అదీ.. జగనన్న ఇదీ.. ఇప్పుడేమో కొత్తగా జగన్ మామ పేరుతో హంగామా.! అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి పోతోంది.? ఎందుకీ వ్యక్తి పూజ.!

మామూలుగా ఎవరన్నా సాయం చేస్తే, వారి పేరుని ‘లబ్ది పొందినవాళ్ళు’ గుర్తు చేసుకుంటారు. ఇక్కడ, సంక్షేమ పథకాలు అమలయ్యేది ప్రజాధనంతో. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి హోదాలో బటన్ మాత్రమే నొక్కుతారు. దానికి బోల్డంత సొంత పబ్లిసిటీ కూడా చేసుకుంటారు.

అప్పులు జరిగేది రాష్ట్రం పేరు మీద.. ఆ అప్పు భారం రాష్ట్ర ప్రజల నెత్తిన పడుతుంది. పుట్టే ప్రతి బిడ్డ మీదా ఆ అప్పు చెల్లించాల్సిన బాధ్యత వుంటుంది. అలాంటప్పుడు, సంక్షేమ పథకాలకి చంద్రన్న పేరు.. జగనన్న పేరు ఎందుకు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.

కొత్తగా ఈ జగన్ మామ కాన్సెప్ట్ ఏంటబ్బా.? అంటే, అదంతే. ఇంతకీ జగన్ మామ తన జేబుల్లోంచి డబ్బులు తీసి, రాష్ట్రంలోని పిల్లల సంక్షేమం కోసం ఏమైనా ఖర్చు చేస్తున్నారా.? లేదే. పైగా, ప్రభుత్వ ప్రకటనల్ని భేషుగ్గా తన సొంత పత్రికకు ఇచ్చుకుంటున్నారాయె.

సలహాదారులకు లక్షల్లో వేతనాలు తెలిసిన విషయమే. లెక్కకు మిక్కిలిగా వున్న సలహాదారులకు మొత్తంగా ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించక తప్పనిసరి. పబ్లిసిటీ ప్రకటనలు.. ఈ సలహాదారుల వేతనాలు.. వీటికి తోడు కుప్పలు తెప్పలుగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో నియమించిన నామినేటెడ్ పోస్టులు.. వాటి వేతనాలు.. లెక్కేసుకుంటూ పోతే తడిసి మోపెడైపోతుంది.

అప్పట్లో చంద్రన్న అయినా, ఇప్పుడు జగనన్న లేదా జగన్ మామ అయినా.. జనం నెత్తిన తమ సొంత పబ్లిసిటీ కోసం అప్పుల భారం మోపుతున్నారన్నమాట. మామూలుగా అయితే అన్నగానీ, మామగానీ సాయం చేయాలి. వీళ్ళేంటో.. బంధుత్వం పేరు చెప్పి.. జనం నెత్తిన బండ మోపుతున్నారు. అది జనానికి ఎప్పుడు అర్థమయ్యేనో ఏమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...