సడెన్ గా తన పేరడీ చిత్రాలతో సందడి చేస్తుంటాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈసారి ఆర్కే మలినేని దర్శకత్వంలో వచ్చిన కాలిఫ్లవర్ లో నటించాడు. ఈరోజే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
ఆండీఫ్లవర్ అనే విదేశీయుడు, మన దేశం యొక్క సంస్కృతీ, సంప్రదాయాలు నచ్చి, ఇక్కడ మహిళలకు ఉన్న గౌరవానికి ముగ్దుడై ఇక్కడే సెటిల్ అయిపోతాడు. ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే, కాలిఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు), ఈయన ఆండీఫ్లవర్ కు మనవడు. తనకు 35 ఏళ్ల వయసులో మళ్ళీ ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అనుకోకుండా తనను ముగ్గురు అమ్మాయిలు రేప్ చేస్తారు.
తనకు జరిగిన అన్యాయంపై కాలిఫ్లవర్ ఎలా న్యాయపోరాటం చేసాడు? తన విషయంలో వచ్చిన తీర్పు ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.
పెర్ఫార్మన్స్:
సంపూర్ణేష్ బాబు తనకు అలవాటైన రీతిలో నటించుకుంటూ వెళ్ళిపోయాడు. సెటైరికల్ చిత్రం కాబట్టి తన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ సరిపోతాయి. కేవలం ఒక కాలిఫ్లవర్ ను తన బాడీకి అడ్డుపెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ వద్ద సంపూ ఇచ్చిన పెర్ఫార్మన్స్ జనాలను మెప్పిస్తుంది. హీరోయిన్ వాసంతి, ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన పోసాని కూడా ఓకే అనిపిస్తారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలో పోసాని పెర్ఫార్మన్స్ చాలా బాగుందనే చెప్పాలి. సంపూ, పోసాని మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. మిగిలిన పాత్రల్లో నటించిన వారు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక నిపుణులు:
సంపూర్ణేష్ బాబుతో సెటైరికల్ సినిమా తీయాలన్న దర్శకుడు ఆర్కే మలినేని ఆలోచన మంచిదే. అయితే దర్శకుడు కొన్ని కామెడీ సీన్స్ మినహా నరేషన్ ఫ్లో మీద అస్సలు దృష్టి పెట్టలేదని అనిపిస్తుంది. పేరడీ సన్నివేశాలు మాత్రమే కాకుండా సంపూ వంటి నటుడితో ఆరోగ్యకరమైన కామెడీని కూడా పండించి ఉంటే కాలిఫ్లవర్ మంచి స్థాయిని అందుకునేది.
ప్రజ్వల్ క్రిష్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలో నిరాశ తప్పదు.
పాజిటివ్ పాయింట్స్:
- సంపూర్ణేష్ బాబు
- కొన్ని కామెడీ సన్నివేశాలు
నెగటివ్ పాయింట్స్:
- సరైన కథ లేకపోవడం
- తప్పుల తడక స్క్రీన్ ప్లే
విశ్లేషణ:
స్పూఫ్ కామెడీగా రూపొందినా సరే, కాలిఫ్లవర్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఫోకస్ చేసుంటే బాగుండేది. అతుకులబొంతలా తయారైన ఈ స్క్రీన్ ప్లేతో కాలిఫ్లవర్ ను మెప్పించేలా చేయడం కష్టమే. ఈజీగా స్కిప్ చేయదగ్గ చిత్రమిది.
తెలుగుబులెటిన్ రేటింగ్: 1/5
In a roundabout way, presently there in no way seems to be
anything left to save in the case you delay.