Switch to English

Bollywood: గాడిన పడ్డ బాలీవుడ్.. హిందీ పరిశ్రమ కి మంచి రోజులు వచ్చాయి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Bollywood: ఒకప్పుడు బాలీవుడ్ సినిమా అంటే ఓ రేంజ్. ఒక బ్రాండ్. భారీ బడ్జెట్, గ్రాండ్ పాటలు ఆ ఇండస్ట్రీ సొంతం. కరోనా తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కోవిడ్ తర్వాత విడుదలైన బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొంతకాలం పాటు సరైన హిట్లు లేక బాలీవుడ్ చతికిలపడింది. దాదాపు మూడేళ్లపాటు తన రేంజ్ కి తగ్గ హిట్ కోసం వెయిట్ చేసిన బాలీవుడ్ కి 2023 సంవత్సరం శుభారంభం పలికింది. భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ ఇండస్ట్రీకి పునర్వైభవం వచ్చి పడుతోంది. ఆ లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో చూద్దాం.

పఠాన్

ఏడాది ఆరంభంలోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shah Rukh Khan).. ‘పఠాన్’ సినిమాతో బోణి కొట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమా విడుదలైంది. కాస్ట్యూమ్స్ విషయంలో విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే( Deepika Padukone)హీరోయిన్ గా నటించింది.

గదర్

2001 లో విడుదలైన ప్రేమ కథా చిత్రం ‘గదర్(Gadar)’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. సన్నీడియోల్-అమీషా పటేల్( Ameesha Patel) జంటగా కేవలం రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.133 కోట్లు కొల్లగొట్టింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘గదర్-2( Gadar-2)’ ఆగస్టు 11న విడుదలైంది. తొలిరోజే ఈ సినిమా రూ.40 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. 20 ఏళ్ల క్రితం స్క్రీన్ పై మ్యాజిక్ ని ఆవిష్కరించిన సన్నీడియోల్- అమీషా జంట ఈ సినిమాలోను మెప్పించారు. విడుదలైన నాలుగు రోజుల్లో రూ.180 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన అనిల్ శర్మ ఈ సినిమాకి కూడా దర్శకుడు.

ఓ మై గాడ్ -2

పదేళ్ల క్రితం వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్-2( Oh My God-2)’ తెరకెక్కింది. అక్షయ్ కుమార్( Akshay Kumar), పంకజ్ త్రిపాఠి,యామి గౌతమ్( Yami Goutham) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో శివుడి గా అక్షయ్ కుమార్, లాయర్ గా యామి గౌతమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిట్ టాక్ తెచ్చుకోవడంతో మరిన్ని వసూలు పెరిగే అవకాశం ఉంది.

‘పఠాన్’ తర్వాత విడుదలైన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేతులెత్తేసినప్పటికీ ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం బాలీవుడ్ కి కాస్త ఉపశమనం కలిగించే విషయం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...