అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ మొదటి పార్ట్ పూర్తి అవ్వబోతుంది. చివరి షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో సినిమా గురించి అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలు మరియు హీరో ఎలివేషన్ సన్నివేశాలు నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటాయని అంటున్నారు. 10 కేజీఎఫ్ లతో పుష్ప పార్ట్ 1 సమానం అంటూ బుచ్చి బాబు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శణం. ఇక ఈ సినిమాలోని బోటు ఫైట్ గురించి మరింత చర్చ జరుగుతూనే ఉంది.
పుష్ప సినిమాలో ఉండే బోటు ఫైట్ ను ప్రేక్షకులు సీటు చివర్లో కూర్చుని చూస్తారట. బోటు లో గతంలో ఫైట్స్ చూసి ఉంటారు. కాని ఈ సీన్ అంతకు మించి అన్నట్లుగా సుకుమార్ తెరకెక్కించాడంటూ చెబుతున్నారు. ఖచ్చితంగా పుష్ప సినిమాకు అదో ప్లస్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమా పై అంచనాలు ఉన్న నేపథ్యంలో షూటింగ్ ను చకచక పూర్తి చేసి అనుకున్నట్లుగా ఆగస్టులో విడుదల చేయాలని పుష్ప మేకర్స్ భావిస్తున్నారు. మరి కరోనా అందుకు సహకరిస్తుందో లేదో చూడాలి.
603868 312455Id require to verify with you here. Which is not one thing I typically do! I take pleasure in reading a submit that will make individuals believe. Additionally, thanks for permitting me to remark! 308551