Switch to English

బిగ్ బాస్.! నామినేషన్ల ఎపిసోడ్‌లో ఏంటీ ఓవరాక్షన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

అక్కడికేదో అత్తా కోడళ్ళ పంచాయితీలా తయారయ్యింది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ వీకెండ్ ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ల వ్యవహారం.! సోమవారం అంటేనే నామినేషన్ల పర్వం. దాంతో, పాయింట్ వున్నా లేకున్నా పెంట పెంట చేసెయ్యడమే కంటెస్టెంట్ల పని.

అసలు ఎందుకు నామినేషన్ చేస్తున్నాం.. అన్న విషయమై కనీసపాటి సోయ కూడా కంటెస్టెంట్లకు వుండటంలేదు. తాజా నామినేషన్ల ఎపిసోడ్‌లో రతిక వర్సెస్ శోభా శెట్టి, రతిక వర్సెస్ ప్రియాంక.. ఘాటైన వాగ్యుద్ధమే జరిగింది. రీ-ఎంట్రీ తర్వాత బాగా డల్ అయిపోయిన రతిక, ఫుల్ జోష్‌లో కనిపించింది. మరీ ముఖ్యంగా ఆమె యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవల్ అనుకోవచ్చు నామినేషన్ల సమయంలో.

ఇంకోపక్క, శోభా శెట్టి కాస్త కామ్‌గా వ్యవహరించిందిగానీ, ప్రియాంక మాత్రం చెలరేగిపోయింది. రతిక – ప్రియాంక.. ఇద్దరూ పోటా పోటీగా యాక్టింగ్ చేసేశారు. పైగా, అది ఓవర్ యాక్టింగ్ అయి కూర్చుంది. అంతకు ముందు, నామినేషన్ కోసం తన వద్ద ఒక్కరి గురించిన పాయింట్స్ మాత్రమే వున్నాయని చెప్పిన రతిక, ‘ల్యాగ్ వద్దు’ అని బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో, ఇద్దర్నీ చకచకా నామినేట్ చేసేసింది. కాగా, ‘టాక్సిక్’ అనే మాటని ప్రియాంక వాడితే, ‘షిట్’ అంటూ రతిక నోరు జారింది.

రతిక తర్వాత తన నామినేషన్స్ ప్రస్తావించాడు అర్జున్. అర్జున్ లిస్టులో తొలుత పేరు పల్లవి ప్రశాంత్ కాగా, రెండో పేరు శోభా శెట్టి. షరామామూలుగానే పల్లవి ప్రశాంత్ అతి చేశాడు. నామినేషన్లనగానే చెలరేగిపోయే పల్లవి ప్రశాంత్ ఇప్పుడూ అదే చేశాడు. ప్రశాంత్‌కి ధీటుగా అర్జున్ కూడా చెలరేగిపోయాడు.

అర్జున్ తన రెండో నామినేషన్‌ని శోభా శెట్టికి వేశాడు. ఈ క్రమంలో ‘తింగరి సమాధానం.. తింగరి ప్రశ్న’ అంటూ శోభా శెట్టి – అర్జున్.. ఇద్దరూ ‘తింగరితనం’ ప్రదర్శించారు. ఇదిలా వుంటే, ఎపిసోడ్‌లో అశ్విని షరామామూలుగానే ఛండాలమైన ఏడుపు షురూ చేసింది.

రతికను ప్రియాంక నామినేట్ చేసే క్రమంలో ‘డామినేషన్’ అనే పదం చుట్టూ పెద్ద రచ్చ జరిగింది. రతికతోపాటు అశ్వినిని కూడా నామినేట్ చేసింది ప్రియాంక. గత వారమంతా ‘రూడ్ బిహేవియర్’ ప్రదర్శించావంటూ అశ్విని మీద ప్రియాంక విరుచుకుపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...