Switch to English

బిగ్ బాస్ 5: సీక్రెట్ రూమ్ లో కూడా సేఫ్ గేమ్ ఎందుకు లోబో!- ఎపిసోడ్ 43

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో ఎవిక్షన్ జరిగింది. ముందుగా ఈరోజు సన్ డే, ఫన్ డే కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా నాగార్జున కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించాడు. ముందుగా రవిని సంచాలక్ గా ప్రకటించి మిగతా కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేసారు.

షణ్ముఖ్, సిరి. కాజల్, శ్రీరామ్, ప్రియాంక, విశ్వ ఒక టీమ్ కాగా మానస్, సన్నీ, ఎన్నీ మాస్టర్, జెస్సీ, ప్రియా, శ్వేతా ఒక టీమ్ గా డివైడ్ అయ్యారు. ఈ టీమ్స్ తో మొత్తం రెండు ఆటలు ఆడించాడు నాగార్జున. ముందుగా సాంగ్ ను టీమ్ చేత గెస్ చేయించాలి. అయితే పీపీ సౌండ్ చేస్తూ సాంగ్ గెస్ చేయించాలి. ఇందులో టీమ్ ఏ నెగ్గారు. ఇక రెండో గేమ్ ఒక్కో టీమ్ నుండి ఒక్కొక్కరు వచ్చి కళ్ళకు గంతలు కట్టుకుని బోన్ ను వెతకాల్సి ఉంటుంది. మిగతా టీమ్ మేట్స్ వారిని గైడ్ చేయాలి. ఇందులో కూడా టీమ్ ఏ గెలిచింది.

ఇక సేఫ్ చేయడం విషయానికి వస్తే నామినేషన్స్ లో ఉన్న వారు అందరికీ సాఫ్ట్ టాయ్స్ ఇచ్చారు. అందులో సేఫ్, అన్ సేఫ్ అన్నది రాసి ఉంటుంది. ఇందులో ప్రియాంక, షణ్ముఖ్ సేఫ్ అయ్యారు. నెక్స్ట్ దాంట్లో నామినేషన్స్ లో ఉన్నవారికి పిగ్గీ బ్యాంక్ ఇచ్చి వాటిని పగలకొట్టాలి. రెడ్ కాయిన్ వస్తే అన్ సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. ఇందులో శ్రీరామ్, సన్నీ సేఫ్ అయ్యారు. తర్వాత జెస్సీ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ఇక ఫైనల్ గా నామినేషన్స్ లో సిరి, శ్వేతా ఉన్నారు. ఇద్దరిలో కొంత సస్పెన్స్ తర్వాత శ్వేతా ఎలిమినేట్ అయింది.

శ్వేతా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి ఒక్కొక్కరి గురించి మంచి మాటలు చెప్పి వెళ్ళింది. ఎవరి గురించి కూడా పెద్దగా నెగటివ్ గా మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఎన్నీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. నాగార్జున మధ్యలో సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబోతో కూడా మాట్లాడారు.

హౌజ్ లో కంటెస్టెంట్స్ చేత అన్ ఫిట్ అని వేయించుకున్న లోబో, సీక్రెట్ రూమ్ లో కూడా ఉండలేను అన్నట్లుగా మాట్లాడాడు. తాను ఇందులో ఇమడలేకపోతున్నానని చెప్పడంతో నాగార్జున తనను మోటివేట్ చేయాల్సి వచ్చింది. తనకు ఈ సీక్రెట్ రూమ్ అస్సలు వద్దని చెప్పగా, అది నిర్ణయించాల్సింది బిగ్ బాస్ అని నాగ్ చెప్పి, వచ్చే వారం కలుస్తానని వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా లోబో సింపతీ కోసం ప్రయత్నిస్తూ, గేమ్ ఆడకుండా సేఫ్ ప్లే చేయాలని చూస్తున్నట్లుగా అనిపించింది.

4 COMMENTS

  1. 249274 302810It was any exhilaration discovering your site yesterday. I arrived here nowadays hunting new issues. I was not necessarily frustrated. Your tips right after new approaches on this thing have been useful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 17376

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...