‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం.. ఈ వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదు..’ ఇదీ కేంద్రం, హైకోర్టులో రాష్ట్ర రాజధాని వ్యవహారంపై దాఖలు చేసిన అఫిడవిట్ సారాంశం. ‘సభలో సభ్యుల మధ్య చర్చ జరిగితే, దానిపై న్యాయ సమీక్షకు అవకాశం లేదు..’ అంటూ కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. దీంతో, రాష్ట్ర రాజధాని వ్యవహారాల్లో కేంద్రం తలదూర్చే అవకాశమే లేదని తేలిపోయింది.
నిజానికి, బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు గత కొద్ది కాలంగా ఇదే మాట చెబుతున్నారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమనీ, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశమే వుండదనీ జీవీఎల్ నరసింహారావు సహా పలువురు బీజేపీ నేతలు కుండబద్దలుగొట్టేస్తోంటే, బీజేపీలోని టీడీపీ అనుకూల వర్గానికి చెందిన సుజనా చౌదరి తదితరులు మాత్రం, ‘సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది..’ అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయితే, అటు కేంద్ర బీజేపీ.. ఇటు రాష్ట్ర బీజేపీ.. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కొనసాగాలని చెబుతున్నారు. అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో వుంది. అయితే, ఇక్కడ పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు అన్నది సుస్పష్టం. అయినాగానీ, బీజేపీలో ఈ రాజధాని విషయమై తీవ్ర గందరగోళం కొనసాగుతోంది.
అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాల్సిందేనని చెబుతున్నప్పుడు, ఆ దిశగా బీజేపీ కార్యాచరణ వుండాలి కదా.! ఇక్కడే బీజేపీకీ, దాని మిత్రపక్షం జనసేన పార్టీకి మధ్య కూడా కొంత గ్యాప్ ఏర్పడుతోంది. ‘రాజధానిగా అమరావతి కొనసాగుతుంది.. ఈ విషయంలో ఇంకో మాట లేదు. బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చాకనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం..’ అని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం.. ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఏదిఏమైనా, రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్రం జోక్యం వుండదని తేలిపోయింది. మరి, ఇప్పుడు వాట్ నెక్స్ట్.? అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, అప్పట్లో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఏమవుతాయి.? మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్లేనా.? ఆగస్ట్ 14 వరకు హైకోర్టు స్టేటస్ కో విధించిన దరిమిలా, ఆ తర్వాత రాజధానికి ఎలాంటి అడ్డంకులు వుండవని భావిస్తున్న వైసీపీ వాదనలో నిజమెంత.? కొద్ది రోజులు ఆగితే తేలుతుంది.
942573 190741Appropriate wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds ought to always take a look at all of the amazing value behind presenting and public speaking, which is to be someones truck. best man speeches brother 575739
441769 957375Giving you the very best News is quite considerably imptortant to us. 830846
802174 347331Yay google is my king aided me to discover this outstanding internet site! . 244173
827637 854991Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 676529
463859 483983Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this incredible like you organize your company at the moment. educational 612013
257265 596396Hello fellow internet master! I really enjoy your web site! I liked the color of your sidebar. 581245