Switch to English

వెంట్రుక కూడా పీకలేరట.. ఎమ్మెల్సీ వాడే భాషేనా ఇది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

టీడీపీ మాజీ ఎంపీ, వైసీపీ తాజా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌. గతంలో టీడీపీ ఎంపీగా వున్న సమయంలో, సైనిక బలగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. వివాదం ముదిరి పాకాన పడ్డంతో, ‘అబ్బే నా ఉద్దేశ్యం అది కాదు..’ అంటూ బుకాయించారు. ఇప్పుడు తాజాగా మరోమారు ఆయన పేరు వివాదాల్లోకెక్కింది. ఆ స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పట్ల వీర విధేయత ప్రదర్శించే క్రమంలో జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘చంద్రబాబు కావొచ్చు, జడ్జిలు కావొచ్చు.. ఎవరైనా కావొచ్చు.. వైఎస్‌ జగన్‌ వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి తెరలేపాయి. గడచిన ఏడాది కాలంగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఎడా పెడా మొట్టికాయలు తినేసింది న్యాయస్థానాల్లో వివిధ అంశాలకు సంబంధించి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు కావొచ్చు, ఇతరత్రా వ్యవహారాల్లో కావొచ్చు.. పదే పదే మొట్టికాయలు తినాల్సి వస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

తాజాగా మూడు రాజధానుల ఎపిసోడ్‌లోనూ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయిన విషయం విదితమే. మీడియా సమావేశంలోనే పండుల రవీంద్రబాబు, ‘వెంట్రుక కూడా పీకలేరు’ అని వ్యాఖ్యానించడంతో అంతా అవాక్కయ్యారు. అధినేత మెప్పు కోసం ఏ స్థాయికి అయినా దిగజారిపోవడానికి వైసీపీ నేతలు సంశయించట్లేదు. కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం ఈ తరహా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.

కోర్టులకు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం, సోషల్‌ మీడియా వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లపైనా, నేతలపైనా చర్యలకు ఆదేశించిన విషయం విదితమే. అయినాగానీ, వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం గమనార్హం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...