తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా 2019 నుండి తగులుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాభవం చవి చూసిన చంద్రబాబు నాయుడు టీమ్ కు ఆ తర్వాత వరుసగా ఓటములు తప్పడం లేదు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కి చేదు ఫలితాలు వచ్చాయి. ఇక తాజాగా మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీ చావు దెబ్బ తిన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది.
మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సహా పలువురు సీనియర్ లకు చాలా పెద్ద షాక్ తగిలింది. తమ నియోజక వర్గాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో కనీసం వార్డులను దక్కించుకోలేక పోయారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులను కూడా గెలుచుకోలేక పోయారు. టీడీపీ హేమా హేమీలకు ఇది తప్పలేదు. మరీ దారుణమైన పరాజయాల నుండి తెలుగు దేశం ఇప్పట్లో కోలుకోక పోవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ లు ఈ షాక్ నుండి బయట పడేందుకు ఎంత టైమ్ పడుతుందో చూడాలంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
926674 150152Excellent day! This post could not be written any better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a excellent read. Thanks for sharing! 488886