Switch to English

రివ్యూ: అల్లుడు అదుర్స్ – చూస్తే బెదిరిపోతారు, జర జాగ్రత్త.!

Critic Rating
( 1.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow
Movie అల్లుడు అదుర్స్
Star Cast బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభ నటేష్, అను ఎమ్మాన్యుయేల్
Director సంతోష్ శ్రీనివాస్
Producer గొర్రెల సుబ్రహ్మణ్యం
Music దేవీశ్రీ ప్రసాద్
Run Time 2 గంటల 29 నిమిషాలు
Release జనవరి 14, 2021

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభ నటేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్, ఇటు డైరెక్టర్ శ్రీనివాస్ హిట్ కొట్టాలనే కసితో చేసిన ఈ కామెడీ ఎంటర్టైనర్ వారికి హిట్ ని ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

శ్రీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) చిన్నప్పుడే వసుంధర అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తనేమో శ్రీనుని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి అమ్మాయిలని ప్రేమించకూడదు అని ఫ్రెండ్స్ తో కలిసి ఒట్టు పెట్టుకుంటారు. కానీ తన ఫ్రెండ్ నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) కూతురు కౌముది(నభ నటేష్)ని ప్రేమ అని వెంటపడ్డాడని తెలిసి, తనని వేసెయ్యబోతుంటే సేవ్ చేయడం కోసం అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ కౌముదిని చూసి ప్రేమలో పడి, అక్కడికక్కడే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆ తర్వాత తనని పడేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైంలో రియలెస్టేట్ లో కింగ్ అయిన గజ(సోనూ సూద్) శ్రీనుని చంపాలనుకుంటుంటాడు. అసలెందుకు గజ శ్రీనుని చంపాలనుకున్నాడు? గజ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరికి శ్రీను గజని తప్పించుకొని, ఇటు జైపాల్ రెడ్డి మనసు గెలిచి శ్రీను కౌముదిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ఈ సినిమాకి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కానీ సినిమా చూసాక హీరో మాత్రం సోను సూద్ అని చెప్తారు. ఎందుకంటే తనే లేకపోతే థియేటర్లోనుంచి ప్రేక్షకులు పరుగులు తీస్తారు. సోను సూద్ ఇప్పటి వరకూ విలన్ గా, కందిరీగ లాంటి సినిమాలో కాస్త ఫన్ ట్రై చేసినా ఈ రేంజ్ లో ఫుల్ ఫన్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకోవడం ఇదే మొదటి సారి. సెకండాఫ్, బాగా బాగా రొటీన్ అండ్ బోరింగ్ గా వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చే సోను సూద్ సీన్స్ కాస్త నవ్వించి రిలాక్స్ చేస్తాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ పాటల్లో డాన్సులు, పైకి కిందకి దూకి ఫైట్స్ కూడా బాగానే చేసాడు. కానీ శ్రీను పాత్రలో ఈజ్ చూపించాలనే ప్రయత్నం చేశారు. అది కొన్ని చోట్ల ఓవర్ అనిపిస్తుంది, ఎదో బలవంతంగా తీసుకొచ్చి చేస్తున్నట్టు ఉంది. నభ నటేష్ కేవలం ఒక గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే అంతకన్నా ఏం లేదు. ఇక అను ఎమ్మాన్యుయేల్ ఉన్నంతలో బాగా చేసింది. కానీ పెద్ద చెప్పుకోదగిన పాత్ర అయితే కాదు. ఇక సెకండాఫ్ లో బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సత్యలు కాస్త నవ్విస్తారు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమాలో టెక్నికల్ గా ఎవరి పనితనం చెప్పుకునే స్థాయిలో లేదు. కాస్త పరవాలేధనిపించింది మాత్రం, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ అండ్ చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ.. అక్కడక్కడా దేవీశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం పరవాలేధనిపిస్తుంది. ఇక పాటలైతే దేవీశ్రీ పాత పాటలు మళ్ళీ వింటున్నట్టుగానే ఉంటాయి. ఇక తమ్మిరాజు ఎడిటింగ్ లో పూర్తి లాగ్ కనిపిస్తుంటుంది. అయినా సినిమా కంటెంట్ అలా ఉంటే ఆయన మాత్రం ఏమని హెల్ప్ చేయగలరు. శ్రీకాంత్ విస్సా రాసిన వన్ లైనర్స్ అక్కడొకటి అక్కడొకటి పేలాయే తప్ప మిగతా అంతా పంచ్ లు రాయాలనే ఆలోచనే తప్ప ఫన్ ని జనరేట్ చేద్దాం అనేలా డైలాగ్ మరియు సందర్భం కనపడలేదు.

ఇక కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అని వేసుకున్న సంతోష్ శ్రీనివాస్ విషయానికి వస్తే.. సినిమా చూడగానే ప్రేక్షకుల మొదటి రియాక్షన్, సార్ ఇక మీరు మారరా?, మీరు తీసిన సినిమాల్నే మళ్ళీ తీస్తున్నారు అనే ఆలోచన మీ బుర్రకి రాలేదా సార్? అని అడుగుతారు. కందిరీగ, హైపర్, పలు శ్రీను వైట్ల సినిమాల ఫార్మాట్ ని మళ్ళీ తిప్పి తిప్పి పరమ బోరింగ్ గా, చూసే ఆడియన్ కి ఇర్రిటేషన్ వచ్చేలా కథని రాసారు, తీశారు కూడాను. అంతకన్నా దారుణంగా పండగ పూట ఈ సినిమాకి ఎందుకు వచ్చాంరా బాబు అని తలలు పట్టుకునేలా కథనం మరియు డైరెక్షన్ ఉన్నాయి. ఒక్క పాత్రని కూడా సరిగా డిజైన్ చేయలేదు, కథలో ఏ ఎమోషన్ ని సీరియస్ గా చెప్పలేదు, అన్నిటికీ సిల్లీ రీజన్స్, సొల్లు కామెడీ సీన్స్ తో సినిమాని నింపారు. ప్లాప్ మీద ప్లాప్ వచ్చినా సంతోష్ శ్రీనివాస్ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేక మరో డిజాష్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. గొర్రెల సుబ్రహ్మణ్యం సినిమా కోసం బాగా ఖర్చు చేశారు, కానీ ఇలాంటి కథకి అంత డబ్బు ఎలా పెట్టారా? ఇప్పుడు అయన పరిస్థితి ఏంటా? అనే అనుమానం అయితే ఆడియన్స్ కి కచ్చితంగా కలుగుతుంది.

విజిల్ మోమెంట్స్:

– సోను సూద్ కామెడీ టచ్
– రిచ్ సాంగ్స్ అండ్ సాయి శ్రీనివాస్ డాన్సులు
– మోనాల్ గజ్జర్ ఐటెం సాంగ్

బోరింగ్ మోమెంట్స్:

– అదే పాత ఫార్ములా కథ
– నీరసం తెప్పించే కథనం
– చిరాకు పెట్టించే కామెడీ సీన్స్
– అన్నీ చూసేసిన సీన్స్ లా ఉండడం
– భరించలేని రన్ టైం
– పాత్రల్లో పస లేకపోవడం
– కామెడీ వర్కౌట్ కాకపోవడం

విశ్లేషణ:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిట్ ఇచ్చిన మొదటి సినిమా నుంచి అల్లుడు అండ్ హిట్ సినిమా అదుర్స్ టైటిల్స్ ని కలిపి చేసిన ఈ అల్లుడు అదుర్స్ సినిమా టైటిల్ మాత్రమే వినడానికి రైమింగ్ లో బాగుందనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం చూసిన ఆడియన్స్ బెదిరిపోయేలా చేస్తుంది. సోను సూద్ కి వచ్చిన క్రేజ్ వలన, సోను సూద్ ఫస్ట్ టైం ఎక్కువ ఫన్ ట్రై చేయడం వలన కాసిన్ని చిరు నవ్వులు ప్రేక్షకుల మొహాలపై వస్తాయే తప్ప ఏం ఉండదు, అవి చూడాలన్నా మీరు ఫస్ట్ హాఫ్ అంతా భరించాలి. అల్లుడు అదుర్స్ ఏ రకంగాను మీరు పెట్టె రూపాయికి న్యాయం చెయ్యదు. ఓవరాల్ గా ఇదే పాత చింతకాయ పచ్చడి సినిమాలు ఇంకా ఎన్నాళ్ళు మా మీదకి వదుల్తారయ్యా అనే ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటకి వస్తారు.

చూడాలా? వద్దా?: ఈ అల్లుడిని భరించడం చాలా అంటే చాలా కష్టం.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.75/5 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...