Switch to English

‘బెదురులంక 2012’ నిర్మాత బెన్నీ ముప్పానేని ఇంటర్వ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,710FansLike
57,764FollowersFollow

జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫోటో’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాల తర్వాత లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా ‘బెదురులంక 2012’. కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకులు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు…

‘బెదురులంక 2012’ నిర్మాత బెన్నీ ముప్పానేని ఇంటర్వ్యూ

మీ నేపథ్యం ఏమిటి? మీ గురించి కొంచెం చెప్పండి!
నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే! సినిమాలు అంటే ఆసక్తి, ప్రేమ! ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. తర్వాత నిర్మాతగా పరిశ్రమలో ప్రవేశించా.

‘బెదురులంక 2012’ టైటిల్ పెట్టడానికి గల కారణం?
కథలో ‘ఫియర్’ (భయం) కూడా ఓ పాత్ర పోషిస్తుంది. అందుకని, ‘బెదురులంక 2012’ అని పెట్టాం. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది కథ. మేం చెప్పాలనుకున్న కథను 2012 నేపథ్యం అవసరం. కథ వేరుగా ఉంటుంది. 100 పర్సెంట్ ఫోకస్ అంతా 2012 మీద ఉండదు.

క్లాక్స్ కథ చెప్పిన తర్వాత అందులో కోర్ పాయింట్ ఏంటనేది చెప్పేశారట! కథ వినేటప్పుడు మీరు ఏయే అంశాలు చూస్తారు?
కథలో ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ప్రేక్షకుడిగా సినిమా చూసినప్పుడు… కొత్తదనం ఉండాలని కోరుకుంటా. కథ కుదిరిన తర్వాత మిగతా అంశాలు అన్నీ కుదురుతాయి. ప్రోమో చూసిన తర్వాత ‘ఎందుకు ఈ సినిమాకు వెళ్ళాలి’ అని ప్రేక్షకులు అనుకోవడానికి ఓ కొత్తదనం కావాలి. నేను అది ‘చెక్ లిస్ట్’గా పెట్టుకున్నా. క్లాక్స్ కథ చెప్పినప్పుడు అందులో పాయింట్ నచ్చింది. ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా సరే… మనం సీరియస్ గా చెప్పలేం. వినోదాత్మకంగా చెప్పాలి. ‘కలర్ ఫోటో’ జరుగుతున్న సమయంలో ఈ కథ ఓకే చేశా. ఆ సినిమా విడుదలకు రెండు నెలల ముందు సినిమా లాక్ చేశాం.

హీరో కార్తికేయ గురించి… ఆయనతో ఎక్‌పీరియన్స్ ఎలా ఉంది?
చాలా హ్యాపీ! కార్తికేయతో ఒక్క శాతం కూడా ఇబ్బంది లేదు. ఆయనతో మళ్ళీ పని చేయాలని అనుకుంటున్నా. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామని అనుకుంటున్నాం.

‘బెదురులంక 2012’ నిర్మాత బెన్నీ ముప్పానేని ఇంటర్వ్యూ

హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
తనకు నచ్చినట్టు జీవించే పాత్రలో కార్తికేయ కనిపిస్తారు. అతడ్ని సమాజం ప్రశ్నిస్తూ ఉంటుంది. హీరో ప్రేయసి పాత్రలో నేహా శెట్టి కనిపిస్తారు. హీరో హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉంటారు. సినిమాలో అన్ని పాత్రలకు క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. మన మనసుకు నచ్చినట్లు 100 పర్సెంట్ బయటకు బతకం, చనిపోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. డ్రామా, కామెడీ సినిమాలో హైలెట్ అవుతాయి. సినిమాలో బోలెడు క్యారెక్టర్లు ఉన్నా సరే… కావాలని పెట్టినట్లు ఒక్క క్యారెక్టర్ కూడా ఉండదు.

కథానాయికగా నేహా శెట్టి అయితే బావుంటుందని మీరే చెప్పారట!
ప్రేక్షకుల్లో ఆ అమ్మాయికి క్రేజ్ ఉంది. ‘డీజే టిల్లు’లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అందులో మోడ్రన్, అర్బన్ రోల్ చేశారు. ఆ అమ్మాయితో రూరల్ బ్యాక్‌డ్రాప్ రోల్ చేయిస్తే బావుంటుందని అనిపించింది. ‘డీజే టిల్లు’లో క్యారెక్టర్ చూసి సెట్ అవ్వదేమో అని క్లాక్స్ అన్నారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది. ఎటువంటి పాత్రలకు అయినా సరే నేహా శెట్టి సెట్ అవుతారని ‘బెదురులంక 2012’తో పేరు తెచ్చుకుంటారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో అంత బాగా నటించారు.

కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాకు టెక్నీషియన్ల పరంగా చాలా పెద్దవాళ్ళను తీసుకున్నారు. కారణం ఏమిటి?
క్లాక్స్ విజన్ స్క్రీన్ మీదకు రావడానికి ఎక్‌పీరియన్స్డ్ టెక్నీషియన్లు అవసరం అనిపించింది. సంగీత దర్శకుడిగా మణిశర్మ గారు, ఛాయాగ్రాహకుడిగా సాయి ప్రకాష్ గారు… ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆర్టిస్టుల విషయంలో కూడా రాజీ పడలేదు.

‘సిరివెన్నెల’ గారితో ఓ పాట రాయించారు కదా! ఆ ప్రయాణం గురించి…
ఆయన పాట రాస్తున్న సమయంలోనే శివైక్యం చెందారు. మాకు ఆ నోట్స్ కూడా మణిశర్మ గారు తెప్పించారు. మిగతా పాటను చైతన్య ప్రసాద్ రాశారు. సిరివెన్నెల గారు తిరిగిరాని లోకాలకు వెళ్లిన తర్వాత ‘ఆయన లాస్ట్ సాంగ్ మా సినిమాలో ఉంది’ అని కొందరు చెప్పారు. నిజానికి ఆయన చివరి పాట మా సినిమాలో ఉన్నా సరే ఆ విషయం బయటకు చెప్పలేదు. దాన్ని పబ్లిసిటీకి వాడుకోకూడదని భావించాను.

ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఆయన ఏమన్నారు?
ట్రైలర్ విడుదల చేయడానికి ముందు రామ్ చరణ్ గారు కథ ఏంటని అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఎంటరైన తర్వాత సీన్స్ గురించి చెప్పారు. మణిశర్మ గారి మ్యూజిక్ చాలా బావుందన్నారు. ట్రైలర్ చూడటానికి ముందు కార్తికేయ, నేహా శెట్టి పెయిర్ బావుందని చెప్పారు.

‘కలర్ ఫోటో’, ‘తెల్లవారితే గురువారం’, ఇప్పుడీ ‘బెదురులంక 2012’ – నిర్మాతగా మీ ప్రయాణం ఎలా ఉంది?
ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి బావుంది. ఐదారు సినిమాలు చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలను. ఏ సినిమాకు అయినా సరే కథ ముఖ్యమని నేను భావిస్తా.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేశాం. ‘బెదురులంక 2012’ విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం. అందులో రెండు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్. ఒకటి భారీ సినిమా.

19 COMMENTS

  1. I have been exploring for a bit for any high quality articles or weblog posts in this sort of space . Exploring in Yahoo I finally stumbled upon this web site. Reading this information So i?m satisfied to convey that I’ve an incredibly good uncanny feeling I found out exactly what I needed. I so much indubitably will make sure to don?t disregard this site and give it a look on a relentless basis.

  2. bookdecorfactory.com is a Global Trusted Online Fake Books Decor Store. We sell high quality budget price fake books decoration, Faux Books Decor. We offer FREE shipping across US, UK, AUS, NZ, Russia, Europe, Asia and deliver 100+ countries. Our delivery takes around 12 to 20 Days. We started our online business journey in Sydney, Australia and have been selling all sorts of home decor and art styles since 2008.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.....

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు...

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.! టీడీపీ పాత్ర ‘గుండు సున్నా’.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తామే గెలిపించామని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.! ఇందులో నిజమెంత.? వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో టీడీపీ సంపూర్ణ మద్దతిచ్చినమాట వాస్తవం. అయితే, అదంతా అనధికారికం. నిజానికి, కాంగ్రెస్...

Ashish Reddy : సైలెంట్ గా రౌడీబాయ్‌ వివాహ నిశ్చితార్థం

Ashish Reddy : టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిలు అయ్యాయి. ప్రభాస్ తో పాటు ఒకరు ఇద్దరు...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 04 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:19 సూర్యాస్తమయం: సా.5:20 ని.లకు తిథి: కార్తీక బహుళ సప్తమి రా.8:28 ని.వరకు తదుపరి కార్తీక బహుళ అష్టమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: మఖ రా.11:57...

Cyclone Michaung: దూసుకొస్తున్న తుపాను..! భారీ నుంచి అతిభారీ వర్షాలు

Cyclone Michaung: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం (Cyclone Michaung) తుపాను తీవ్రంగా మారుతోంది. మంగళవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లాలోని దివిసీమలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ...

Sunil Konugolu: కేసీఆర్ ని కాదని.. రాహుల్ తో జతకట్టి…ఎవరీ సునీల్ కొనుగోలు?

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఎంతోమంది రాజకీయ మేధావులను ప్రధానులు, రాష్ట్ర పతుల్ని చేసిన ఘన చరిత్ర ఆ పార్టీది. అయితే గత కొన్నాళ్లుగా సరైన నాయకత్వం...