Switch to English

ఏపీలో బూతుపురాణం: ఎన్నికల కమిషనర్‌ ‘పీకేది’ అదేనా.?

దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడూ ఎన్నికల కమిషన్‌ని ఉద్దేశించి అంత జుగుప్సాకరంగా మాట్లాడింది లేదు. అదేంటో, బూతులు మాట్లాడేందుకే కొందర్ని ప్రత్యేకంగా నియమించినట్లున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. తన మంత్రి వర్గంలోనూ ‘బూతులు’ మాట్లాడటంలో స్పెషలిస్టులు వుండేలా చూసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

‘జుట్టు, వెంట్రుక..’ అనేవి సాధారణ పదాలే. ‘బొచ్చు’ అనే మాట కాస్తంత ఇబ్బందికరంగా వుంటుంది. ‘బొచ్చు పీకుతారా.?’ అంటే, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. ‘నీయమ్మ మొగుడు’ అనే మాటని చాలా తేలిగ్గా వాడేస్తుంటారు మంత్రి కొడాలి నాని. అది ఆయనకి ఊతపదం అయిపోయింది ఈ మధ్య. ఏ విషయమ్మీద అయినా సరే మాట్లాడాల్సి వస్తే, ‘నీయమ్మ మొగుడు’ అంటూ విరుచుకుపడిపోతున్నారు ఈ మంత్రిగారు. ఒకసారి నోరు జారితే అదో లెక్క. కానీ, పదే పదే కొడాలి నాని ఇలా రెచ్చిపోతున్నారంటే, ఆయనకి ముఖ్యమంత్రి నుంచి ఏ స్థాయిలో ‘సపోర్ట్‌’ వుందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మీద, ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ‘కులం’ పేరుతో దూషణలకు దిగిన విషయం విదితమే. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఆఖరికి స్పీకర్‌ కూడా రమేష్‌కుమార్‌పై అవాకులు చెవాకులు పేలారు. ఆ ప్రసహనం ఇంకా ముగిసిపోలేదు. తాజాగా కొడాలి నాని, ‘రమేష్‌ కుమార్‌ ఏం పీకుతాడు.? బొచ్చు పీకుతాడా.?’ అంటూ నోరు పారేసుకున్నారు. నిజానికి, రాయడానికి వీల్లేని భాష ఇది. కానీ, ఎలక్ట్రానిక్‌ మీడియా పుణ్యమా అని సెన్సార్‌ లేకుండానే నేతల బూతులు బయటకు వచ్చేస్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోలేని భాషని ఉపయోగిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

ఇప్పుడు రమేష్‌కుమార్‌, రేప్పొద్దున్న కనగరాజ్‌.. ఎవరికైనా ఇదే గతి. ఎందుకంటే, వైసీపీ చెప్పినట్లే అధికారులు నడుచుకోవాలి.. నడుచుకోకపోతే అంతే సంగతులు. ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం. ఎన్నికల కమిషన్‌ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన, రాజ్యాంగ బద్ధమైన సంస్థ. కానీ, అధికార పార్టీ నేతలకి ఆ మాత్రం కూడా ఇంగితం లేకపోవడాన్ని ఏమనుకోవాలి.?

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

షాకింగ్: మిడతల బిర్యానీ వారికి ఫేవరేట్ డిష్, ఎక్కడో తెలుసా??

కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర...

బర్త్ డే స్పెషల్‌: అన్నగారు, మరో నూరేళ్లయినా సరిలేరు మీకెవ్వరు.!

తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దినది.. తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పించింది.. తెలుగు వారి ఆత్మ గౌరవంను కాపాడినది.. తెలుగు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించి పెట్టింది.. తెలుగు భాషను...

అద్దె చెల్లించలేదని గన్‌తో కాల్చి చంపేసిన ఇంటి యజమాని

గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రైవేట్‌ ఉద్యోగస్తులు ఆదాయం లేక కనీసం తిండికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర...

క్రైమ్ న్యూస్: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అఘాయిత్యం

ప్రేమ పేరుతో షాద్‌ నగర్‌కు చెందిన భాను యువతిపై దారుణంకు పాల్పడ్డారు. స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న యువతిని భాను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నట్లుగా నమ్మించాడు. ఇటీవల ఆమెను ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ...

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....