Switch to English

వైఎస్‌ జగన్‌.. రైట్‌ డెసిషన్‌.. రాంగ్‌ టైమింగ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ని మే 3వ తేదీ వరకూ పొడిగిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇది తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం మాత్రమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మే 3 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింపు తప్పనిసరి అని ప్రకటన చేశాక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విధిలేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది నిర్వివాదాంశం.

నిజానికి, దేశంలో పరిస్థితుల్ని అంచనా వేసిన పలు రాష్ట్రాలు, ప్రధాని ప్రకటన కంటే ముందే తమ తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కరోనా పాజిటివ్‌ కేసుల ప్రభావం చాలా తక్కువగా వున్న ఒరిస్సా అందరికంటే ముందుగా లాక్‌డౌన్‌ని పొడిగించడం గమనార్హం. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆ బాటలోనే నడిచాయి. అయితే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం, ‘రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌..’ అంటూ లెక్కలు చెబుతూ, సడలింపుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ, కేంద్రం ‘సడలింపులకి’ ససేమిరా అనేసింది.

దాంతో, చేసేది లేక వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. కరోనా వైరస్‌కి జోన్లతో సంబంధం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా కేసులు పుట్టుకొస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందిప్పుడు దేశంలో. కృష్ణా జిల్లాలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు కన్పించలేదు. కానీ, నిన్న అనూహ్యంగా విజయవాడ నగర పరిధిలోనే 8 కేసులు నమోదు కావడం గమనార్హం.

పరిస్థితి తీవ్రతకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తప్ప, రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లోనూ చాపకింద నీరులా కరోనా వైరస్‌ విస్తరించేసింది. గ్రౌండ్‌ రియాల్టీ ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నా, పరిస్థితి మాత్రం అత్యంత తీవ్రంగానే వుందనే విషయం స్పష్టమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Karthikeya: కార్తికేయ “భజే వాయు వేగం”.. ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya). ఆయన నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...