Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మస్థుతి.. పర నింద.. ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖకు మహర్దశ పట్టనుందట. అలాగని వైఎస్ జగన్ సర్కార్ చెబుతోంది. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మంచిదే, విశాఖ అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా అభినందించాల్సిందే. కానీ, నిజానికి.. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా, విశాఖను అభివృద్ధి చేయలేకపోతున్నారు.. చేతనైనంతమేర నష్టం చేసి పోతున్నారు.

చంద్రబాబు హయాంలో విశాఖ చుట్టూ జరిగిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఆ కాలంలోనూ విశాఖపట్నం ఐటీ రంగం పరంగా అభివృద్ధి చెందలేకపోయింది. విశాఖను చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేసిందంటూ వైఎస్ జగన్ సర్కార్, రెండేళ్ళ నుంచీ భజన చేస్తూనే వుంది. ఆత్మ స్తుతి.. పర నింద.. అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన కొత్తల్లో, సమైక్య పాలకులు చేసిన నష్టం.. అంటూ కొన్నాళ్ళపాటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాటలు వినిపించేవి. ఆ తర్వాత ఆ ‘రొద’ తగ్గిపోయింది.

తెలంగాణ బలాబలాలేంటన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది.. మరింతగా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ వెళుతోంది. చంద్రబాబు హయాంలో విశాఖకు అన్యాయం జరిగిందన్న వైసీపీ మాటలే నిజమనుకుందాం. మరి, గడచిన రెండేళ్ళలో విశాఖకు వైఎస్ జగన్ సర్కార్ చేసిందేంటి.? రెండేళ్ళ తర్వాత ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వైఎస్ జగన్ సర్కారు సాధించిన ఘనత అనుకోగలమా.?

విశాఖ రైల్వే జోన్ రావాలి.. విశాఖ సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని జాతీయ విద్యా సంస్థలు రావాలి.. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలున్నాయి.. కానీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. నిజానికి, గడచిన రెండేళ్ళలో విశాఖ నుంచి కొన్ని ఐటీ సంస్థలు తమ కార్యాలయాల్ని హైద్రాబాద్, బెంగళూరు, చెన్నయ్ లాంటి నగరాలకు తరలించుకుపోయాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....