Switch to English

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో.. సినిమా కలెక్షన్ల శాఖ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,415FansLike
57,764FollowersFollow

ఏ  చిత్రానికైనా ఆ మూవీ నిర్మాతే బాక్సాఫీస్ వసూళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు. ఎందుకంటే, ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో.. ఎంత వసూళ్ళు జరిగాయో.. ఆయనే కదా తెలుసుకోవాల్సింది. తద్వారా తదుపరి సినిమాకి ఎంత ఖర్చు చేయాలన్నదానిపై ఓ అవగాహన వుంటుంది.

సినీ అభిమానులకి, ఈ వసూళ్ళ లెక్కల గురించిన ఆసక్తి ఎక్కువ. అలా బాక్సాఫీస్ ట్రాకింగ్.. అనే ఓ ప్రస్తావన షురూ అయ్యింది. వెబ్ సైట్లు కావొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావొచ్చు.. యూ ట్యూబ్ ఛానళ్ళు కావొచ్చు.. వసూళ్ళ లెక్కల గురించి ప్రస్తావిస్తుంటాయి.

రీడర్‌షిప్ పెంచుకోవడం.. వీక్షకుల్ని పెంచుకోవడం.. ఈ క్రమంలోనే ఈ వసూళ్ళ లెక్కల గురించిన హంగామా.! ఈ వసూళ్ళ లెక్కల్లో నిజమెంత.? అంటే, నేతి బీరకాయలో నెయ్యి చందమే.!

వంద కోట్లు ఖర్చు చేశాం.. అని నిర్మాత చెబితే అది పబ్లిసిటీ స్టంట్. వంద కోట్లు వసూలయ్యింది.. అంటే, అది కూడా జస్ట్ పబ్లిసిటీ స్టంట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాల దగ్గర అసలు సిసలు లెక్కలుంటాయ్.. ఎందుకంటే, సంబంధిత ఖర్చుల్ని నిర్మాతలు పన్నులు కట్టే సమయంలో వెల్లడిస్తుంటారు గనుక.

అయినా, ఏనాడూ ప్రభుత్వాలు ఈ వసూళ్ళ గురించి మాట్లాడవు. వాస్తవాలు ప్రభుత్వాలకు తెలుసు కాబట్టి. అనుమానమొస్తే మాత్రం, ఐటీ శాఖ నుంచి సోదాలు షురూ అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది మళ్ళీ వేరే చర్చ.!

ఎప్పుడూ ప్రభుత్వాల్లో వున్న వ్యక్తులు సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడరు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడతారు. అంతే కాదు, సినిమాలకు రివ్యూలూ ఇస్తుంటారు. సినిమా హిట్టు, ఫ్లాపు, డిజాస్టర్ అని కూడా తేల్చేస్తుంటారు.

తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో సెటిలైంది. ఆ కోణంలో చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందీ సినిమాలెలాగో.. తెలుగు సినిమాలూ అంతే. హిందీ సినిమాల వసూళ్ళ గురించి ఏపీ మంత్రులు మాట్లాడలేరు కదా.! కానీ, తెలుగు సినిమాల విషయంలో అనవసర జోక్యం చేసుకుంటుంటారు.

పైగా.. వార్నింగులొకటి.! ‘ఇకపై సినిమాలు తీసేటప్పుడు జాగ్రత్త..’ అంటూ నేరుగా రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు తెచ్చి మరీ మంత్రి అంబటి రాంబాబు వార్నింగు లాంటి విజ్ఞప్తి చేసేశారు. ఇదెక్కడి పంచాయితీ.? స్వర్గీయ ఎన్టీయార్ మీదనే వెటకారంగా సినిమాలు తీసిన సందర్భాలున్నాయి.

చంద్రబాబు మీద.. పవన్ కళ్యాణ్ మీదా వెటకారాలతో సినిమాలు తీయట్లేదా.? అయినా, ‘బ్రో’ సినిమాలోని ‘శ్యాంబాబు’ అనే పాత్ర మీద మంత్రి అంబటికి ఎందుకంత అక్కసు.? ఆ పాత్రని ఆయన తనకు తాను అన్వయించుకోవడమేంటి.? గతంలో పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. మంత్రులుగా వున్న సమయంలో ఇలాగే, సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్, వసూళ్ళ గురించి మాట్లాడి పదవులు కోల్పోయారు.

మంత్రి అంబటి రాంబాబు సంగతి ఏమవుతుందో మరి.! అయినా, మంత్రిగారి తాటాకు చప్పుళ్ళక భయపడేదెవరు.? ఆయనేమన్నా సినిమా కలెక్షన్ల శాఖ మంత్రి కాదు కదా.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా...

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి...

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam)....

Prabhas: ‘ఇదే నా బుజ్జి..’ కల్కి 2898 AD ఈవెంట్లో పరిచయం...

Prabhas: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్...

Pawan Kalyan: చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ‘స్వామినాయుడు’కు జనసేనాని అభినందనలు

Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా...

రాజకీయం

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Janasena: NRI జనసైనికుల ఉదారత.. అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధిక సాయం

Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం...

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. గురువారం గుడివాడలోని తన స్వగృహంలో నందివాడ వైసీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. వారితో మాట్లాడుతూండగానే...

పిన్నెల్లి ఎక్కడ? హైదరాబాద్ లో ఉన్నారా? తమిళనాడుకు పారిపోయారా?

'మంచివాడు, సౌమ్యుడు, గెలిపిస్తే మీకు మంచే చేస్తాడు' ఇవీ మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పరిచయం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు. ప్రచార సభలో దాదాపుగా...

ఎక్కువ చదివినవి

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి.. టీజర్ ఆకట్టుకుంటోంది....