Switch to English

ప్రపంచ భవిష్య నగరం అమరావతి.! ఏంటీ దుర్గతి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.! పేరు గొప్ప, ఊరు దిబ్బ.! ఔను, ఇది ముమ్మాటికీ నిజం. అమరావతి కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సాగుతోంది. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం, అమరావతి అనేది ఓ ‘కుంభకోణాలకు కేంద్ర బిందువు’.!

అసలు అమరావతి ఏం పాపం చేసింది.? అమరావతిలో కుంభకోణం జరిగితే, ఆ కుంభకోణానికి పాల్పడినవారిని కదా జైళ్ళలోకి పంపాల్సింది.? అమరావతికి ఎందుకు శిక్ష విధిస్తున్నట్లు.? ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. అమరావతి మీద ‘కమ్మరావతి’ అనే ముద్ర వేయడం ముమ్మాటికీ రాజకీయ కుట్రే.

మూడు రాజధానుల ముసుగులో అమరావతిని ‘హత్య’ చేసేందుకు వైసీపీ కంకణం కట్టుకుందనే విమర్శలు లేకపోలేదు. ‘పేరుకే మూడు రాజధానులు.. అసలు సిసలు రాజధాని విశాఖ మాత్రమే..’ అని అధికార పార్టీ నాయకులు, అందునా మంత్రులు చెబుతున్నారు. రాజధానిగా అమరావతిని తొలగిస్తామంటూ మంత్రి హోదాలోనే కొడాలి నాని గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కానీ, ప్రపంచ భవిష్య నగరాల్లో అమరావతికి చోటు దక్కింది. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆరు భవిష్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చోటు దక్కడం చిన్న విషయమేమీ కాదు. ఈ లిస్టులో మెక్సికో, టెలోసా (అమెరికా), చెంగ్డు స్కై వ్యాలీ (చైనా), ఓసియానిక్స్ బుసాన్ (దక్షిణ కొరియా), ద లైన్ (సౌదీ అరేబియా) మిగతా భవిష్య అద్భుత నగరాలు కావడం గమనార్హం.

ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే ప్రపంచ స్థాయి పత్రిక (ఆర్కిటెక్చర్‌కి సంబంధించినది) ఈ నగరాల పేర్లను ప్రపంచ అద్భుత భవిష్య నగరాలుగా ప్రస్తావించింది. 103 ఏళ్ళుగా నడుస్తోంది ఈ పత్రిక. ఏదో ఆషామాషీగా భవిష్య నగరాలనేయలేదు. వీటి కోసం తయారు చేయబడిన డిజైన్లు, స్థానిక పరిస్థితులు.. పర్యావరణం.. ఇలా చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు.

టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎంపికైంది. అంతే, టీడీపీ హయాంలో ప్రారంభమైన పనులు తప్ప, వైఎస్సార్సీపీ హయాంలో అదనంగా ఒక్క ఇటు కూడా అమరావతి కోసం పేర్చింది లేదు. అమరావతి పేరుతో పెట్రోల్, డీజిల్‌పై ‘సెస్’ మాత్రం అదనంగా విధిస్తూ వస్తున్నారు వైసీపీ హయాంలో కూడా.!

రాజధాని అంటే రాష్ట్ర లేదా దేశ ప్రజల ఆత్మగౌరవం. అలాంటి ఆత్మగౌరవంతో చెలగాటమాడటం అనేది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు.. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...