Switch to English

రాంచరణ్,ఎన్టీఆర్ లలో ఎవరు ‘గ్లోబల్ స్టార్’ ?!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రపంచ వేదికలపై మన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటుతోంది. ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఇంకోపక్క, రామ్ చరణ్‌ని ఇంటర్నేషనల్ సూపర్ స్టార్.. అంటూ కొందరు హాలీవుడ్‌లో పొగుడుతున్నారు. గ్లోబల్ స్టార్ అని అంటున్నారు కూడా. ఇంకోపక్క ‘ఎన్టీయార్ గోస్ గ్లోబల్’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు తమ అభిమాన హీరోని ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలే. ఎన్టీయార్ గొప్ప నటుడు.. కాదని ఎలా అనగలం.? అలాగని, రామ్ చరణ్‌ని తక్కువ చూస్తే ఎలా.?

అసలు విషయానికొస్తే, ఓ వెబ్ సైట్. తాజాగా ‘గ్రేట్’ పోల్ ఒకటి పెట్టింది. అందులో గ్లోబల్ స్టార్ ఎవరు.? అన్న ప్రశ్న వుంచారు. ‘పోల్’లో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అని తేలింది.

ఫేక్ పోల్.. అంటూ ఎన్టీయార్ అభిమానులు గుస్సా అవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. అసలు ఆ పోల్ పెట్టడానికే కొందరు ఎన్టీయార్ అభిమానులు కారణమట. అయితే, అనూహ్యంగా ఈ పోల్‌లో రామ్ చరణ్ అభిమానులూ సత్తా చాటారు. దాంతో, చెప్పుకోదగ్గ మార్జిన్‌తోనే ఎన్టీయార్‌పై రామ్ చరణ్ ‘గ్లోబల్ స్టార్’ ఇమేజ్ గెలుచుకోగలిగాడు. అదీ అసలు సంగతి. చివరి వరకూ సోకాల్డ్ ఎన్టీయార్ అభిమానులు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందట. వాళ్ళకు సమాధానం చెప్పలేక సదరు వెబ్ సైట్ నిర్వాహకులు తంటాలు పడాల్సి వస్తోంది.

మరోపక్క, అంతకు ముందు ఇంకో మీడియా సంస్థ కూడా గ్లోబల్ స్టార్ విషయమ్మీదనే పోల్ నిర్వహించింది. ఈ పోల్ వెనుక కూడా ఎన్టీయార్ అభిమానుల కష్టమే దాగి వుంది. మరింత ఉధృతంగా ఎన్టీయార్ అభిమానులు ఈ పోల్‌లో తమ అభిమాన నటుడు ఎన్టీయార్‌కి మద్దతుగా ఓట్లు వేశారు. ఈసారి మాత్రం ఎన్టీయార్‌కి విజయం దక్కింది.
.
ఆయా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని ఫాలో అవుతున్నవారిలో ఎంతమంది ఎవరి ఫ్యాన్స్.? అన్నదాన్ని బట్టి ఆయా పోల్స్ తాలూకు రిజల్ట్స్ ఆధారపడి వుంటాయి.

ఇదిలా వుంటే, ఇటీవల ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో జూనియర్ ఎన్టీయార్ ‘ఆర్ఆర్ఆర్’ బృందంపై అసహనం వ్యక్తం చేశారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ఒక్కటైతే నిజం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఇద్దరు కాదు, ముగ్గురు హీరోలు. గ్లోబల్ స్టార్స్.. అంటే, రామ్ చరణ్ అలాగే ఎన్టీయార్ మాత్రమే కాదు, రాజమౌళి కూడా.! రామ్ చరణ్ అంటే గిట్టనివారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే గుర్తింపుని జీర్ణించుకోలేనివారి కారణంగా.. ఎవరు గ్లోబల్ స్టార్.? అన్న రచ్చ జరుగుతోందంతే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...