Switch to English

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ.! నమ్మగలమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాజధాని కాబోతోందట. అలాగని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ అనుకూల మీడియా నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. ఈసారి ఏ చిన్న సాంకేతిక పొరపాట్లకూ తావు లేకుండా పక్కాగా బిల్లు పెట్టి, చట్టంగా మార్చి.. విశాఖకు రాజధాని హోదా ఇచ్చి తీరాలని వైఎస్ జగన్ సర్కారు భావిస్తోందట.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న పేరుతో గతంలోనే విశాఖకు రాజధాని హోదా ఇచ్చేందుకు వైఎస్ జగన్ సర్కారు ప్రయత్నించిందిగానీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా అది సాధ్యపడలేదు. వికేంద్రీకరణ పేరుతో తెచ్చిన మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

‘ఈసారి మాత్రం పక్కా.. విశాఖ రాజధాని అయి తీరుతుంది..’ అంటూ పలువురు మంత్రులు కుండబద్దలుగొట్టేస్తున్నారు. అమరావతి విషయంలో ఎటూ జగన్ సర్కారుకి చిత్తశుద్ధి లేదు. కానీ, కర్నూలుని రాజధాని చేస్తామన్నారు కదా, ఆ దిశగా సమాలోచనలు ఏమైనా జరుగుతున్నాయా.? అంటే, ప్రస్తుతానికి అంత సానుకూల చర్చ కర్నూలు గురించి వైసీపీలో జరగడంలేదట.

విశాఖ మాత్రమే.. కేవలం విశాఖ మీదనే.. అన్నట్టుగా అధికార వైసీపీ ఫోకస్ వున్నట్లు కనిపిస్తోంది. విశాఖకు వున్న ప్రత్యేకతలు అలాంటివి మరి. నిజానికి, చంద్రబాబు హయాంలోనే విశాఖపట్నం, రాష్ట్రానికి రాజధాని అయి వుండాలి. కొన్ని కారణాలతో విశాఖకు వచ్చిన ఆ అవకాశాన్ని అప్పటి ‘పచ్చ’పాత ప్రభుత్వం అమరావతికి తన్నుకుపోయింది.

అయితే, అమరావతి పొట్టకొట్టి.. విశాఖను అందలం ఎక్కించాలని విశాఖ వాసులుగానీ, ఉత్తరాంధ్రవాసులుగానీ కోరుకోరు. విశాఖకు రాజధాని వస్తోందంటే, ఆ పేరుతో దోపిడీ పెరిగిపోతుందన్న భయం కూడా స్థానికంగా వినిపిస్తోంది. మరోపక్క, ఏదో ఒకటి.. రాష్ట్రానికైతే రాజధాని వుండాలి కదా.. ఈ రాజధాని సంక్షోభం నుంచి ఎలాగోలా రాష్ట్రం గట్టెక్కితే చాలన్న భావన కూడా చాలామందిలో వుంది.

సంక్షోభంలోకి నెట్టేసి, చెయ్యందిస్తున్నట్లుగా చేసి.. తమ పంతం నెగ్గించుకోవడం నయా రాజకీయ పాలనా సూత్రంగా భావించాలేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...