Switch to English

అల్లు అరవింద్.! సినీ నిర్మాణ రంగంలో ఆ ‘గీత’ సాక్షిగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

గీతా ఆర్ట్స్.! తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ బ్యానర్ గురించి. ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.!

స్వర్గీయ అల్లు రామలింగయ్య తనయుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్, తండ్రి బాటలో నటుడిగా రాణించలేకపోయారు. నిజానికి, నటన ఏనాడూ ఆయన ప్రయార్టీ కానే కాదు. కాకపోతే, నటనపై వున్న ఆ కాస్త ఆసక్తితో అడపా దడపా తెరపై మెరుస్తుంటారు. అదీ చాలా అరుదైన సందర్భం.

అప్పుడెప్పుడో ‘చంటబ్బాయ్’ సినిమాలో కాస్త నిడివి వున్న పాత్ర పోషించారు అల్లు అరవింద్. ఆయన నటుడిగానూ కొనసాగి వుంటే, తండ్రిని మించిన నటుడయ్యేవారని కొందరంటుంటారు. అది వేరే విషయం. అయితేనేం, తండ్రి పేరు నిలబెట్టడానికి నటనా రంగంలోకే రావాలా.? నిర్మాతగా ఎందుకు తన తండ్రి పేరుని నిలబెట్టకూడదు.? అనుకున్నారు అల్లు అరవింద్.

ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్, తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగేలా, తనదైన కృషి పట్టుదలతో వ్యవహరించారు.. అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. నటుడిగా తెరపై కనిపించకపోయినా, అల్లు అరవింద్ కామెడీ టైమింగ్ సూపర్బ్. ఆయన చాలా సినీ వేదికల్లో దాన్ని చాటుకుంటూ వుంటారు.

బావ చిరంజీవికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ, మెగా కాంపౌండ్‌కి వెన్ను దన్నుగా నిలిచారు. అదే క్రమంలో ఇప్పుడు ఆ మెగా కాంపౌండ్‌కి అనుబంధంగా అల్లు కాంపౌండ్ అనే ఇంకో వృక్షం సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకత చాటుకునేలా చేయగలుగుతున్నారు. దటీజ్ అల్లు అరవింద్.

చిరంజీవి – అల్లు అరవింద్ మధ్య పొరపచ్చాలట.. అని తరచూ వచ్చే విమర్శలకు ఆయన తనదైన స్టయిల్లో సమాధానమిస్తుంటారు. ‘మేమిద్దరం కృష్ణార్జునుల్లాంటోళ్ళం’ అని చెబుతుంటారీ ప్రముఖ నిర్మాత. నిర్మాణ రంగంలోనే కాదు, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ అరవింద్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇవన్నీ ఓ యెత్తు.. ‘ఆహా’ ఇంకో యెత్తు.!

ఆహాహా.! అల్లు అరవింద్ ఎంతమందికి రోల్ మోడల్.. అని ఎవరైనా అనుకోవాల్సిందే. గొప్ప నటుడికి తనయుడిగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తండ్రిగా.. అల్లు అరవింద్ సినీ రంగంలో మరిన్ని పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగు బులెటిన్.

అల్లు అరవింద్.! సినీ నిర్మాణ రంగంలో ఆ ‘గీత’ సాక్షిగా.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...