‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ‘సాహో’. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరియు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అలాగే తన తదుపరి సినిమా షూట్ ని కొద్దీ రోజులు ఆపి మార్పులు చేర్పులు చేపట్టాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో చేయనున్న ‘జాన్’ సినిమా షూట్ మొదటగా సెప్టెంబర్ మిడ్ నుంచి మొదలవ్వాలి కానీ కథలో మార్పులు చేయమనడం, అలాగే ప్రభాస్ లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన కారణంగా అక్టోబర్ చివరికి వెళ్ళింది.
ఇక్కడ ప్రభాస్ సినిమా షూట్ ని డిలే చేయడం ఆ చిత్ర టీంకి కాస్త నిరాశని మిగిల్చినా, అక్కినేని యంగ్ హీరో అఖిల్ కి మాత్రం పెద్ద వరంగా మారింది. ఎలా అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారి, వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న బ్యూటీ పూజ హెగ్డే. ప్రభాస్ ‘జాన్’లో తనే హీరోయిన్. ప్రస్తుతం తన డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కానీ బొమ్మరిల్లు భాస్కర్ – అఖిల్ సినిమా అనుకున్నప్పటి నుంచి పూజ హెగ్డేనే తీసుకోవాలని పట్టుబట్టారు, తాను అడిగినంత రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ డేట్స్ లేవు. అదే టైంలో ప్రభాస్ సినిమా షూట్ వాయిదా పడడంతో పూజ ఏ మాత్రం ఆలస్యం లేకుండా ‘జాన్’ షూట్ డేట్స్ ని అఖిల్ సినిమాకి ఇచ్చేయడమే కాదు ఇమ్మీడియట్ గా షూట్ కూడా స్టార్ట్ చేసేసింది.
మొదటి నుంచి పూజ హెగ్డే లక్కీ చార్మ్ తన సినిమాకి తోడవ్వాలి అనుకుంటున్న అఖిల్ కూడా ఇప్పుడు చాలా హ్యాపీ అని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైతేనేం ప్రభాస్ ఆలస్యం అఖిల్ కి వరంలా మారి ఆనందాన్ని ఇచ్చింది.
189258 23754Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, excellent internet site and I appear forward to seeing it expand over time. 423511
874370 158298Merely wanna input on couple of general points, The internet site design is perfect, the topic material is rattling superb : D. 383394
696603 541689very very good put up, i in fact really like this web internet site, keep on it 256888