పంజా వైష్ణవ్ తేజ్( VaishnavTej), శ్రీ లీల( Sree leela)జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ( Adi keshava)’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు మూవీ టీం ట్రైలర్ ని విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్ క్లాస్ అండ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. సుదర్శన్-వైష్ణవ్ మధ్య వచ్చే సంభాషణలు, సీన్లు నవ్వు తెప్పిస్తున్నాయి. శ్రీ లీల క్యూట్ లుక్స్ తో కనిపించింది. సీనియర్ నటి రాధిక.. వైష్ణవ్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. తన కొడుకుని ఉద్దేశించి రాధిక చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండింది.
‘నేను అయోధ్యలో ఉండే రాముణ్ని కాదప్పా, ఆ రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరున్ని’ అంటూ రాయలసీమ యాసలో ట్రైలర్ ఆఖరిలో వైష్ణవ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణ దాస్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు అలరిస్తున్నాయి.