మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కానుందని మొదట ప్రకటించారు కానీ తాజా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడుతున్నాయి. ఇంకా ఆచార్య ప్యాచ్ వర్క్ షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆచార్య రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.
తాజాగా ఏప్రిల్ 1న ఆచార్య విడుదల తేదీ ప్రకటించారు. నిజానికి ఈ డేట్ కు సర్కారు వారి పాట రావాల్సి ఉంది. కానీ సర్కారు వారి పాట షూటింగ్ లో కూడా జాప్యం జరుగుతోంది. లాస్ట్ షెడ్యూల్ తర్వాత సర్కారు వారి పాట షూటింగ్ కు బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ను ఆచార్య తీసుకుంది.