Switch to English

జస్ట్ ఆస్కింగ్: అప్పు దొరికింది.. అంతే కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రగతి.. అంటూ వైసీపీ అనుకూల మీడియా బీభత్సమైన ప్రచారానికి తెరలేపింది. కేంద్రం, రాష్ట్రానికి అదనపు అప్పులు చేసుకోనీయకుండా హెచ్చరికలు చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతూ, తాజాగా రాష్ట్రం 2,655 కోట్లు రుణం సమకూర్చుకునేందుకు అనుమతిచ్చిందన్నది వైసీపీ, వైసీపీ అనుకూల మీడియా చెబుతోన్న విషయం.

రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పు పుట్టడం గగనంగా తయారైంది. అప్పుల మీద అప్పులు.. కుప్పలు తెప్పలుగా అప్పులు.. ఎడా పెడా అప్పులు.. ఆంధ్రప్రదేశ్ గురించి ఇంతకన్నా భిన్నంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

గడచిన రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి నీరసించింది.. అప్పులేమో కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్నాయి. ‘చంద్రబాబు హయాంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత మామీద పడింది..’ అంటూ వైసీపీ పదే పదే చంద్రబాబు పేరుని ప్రస్తావిస్తోంది.

అంతకు ముందు చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారు. రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని చంద్రబాబు సెలవిచ్చారు. మరి, ఇప్పుడు వైసీపీ చేస్తున్న అప్పుల మాటేమిటి.? దానికి వడ్డీలు కట్టాల్సిందెవరు.? అసలు అప్పు తీర్చాల్సిందెవరు.? భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా, అంతకు మించి అప్పులు చేయాలి తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారమే వుండదు.

అప్పు ఎంత ప్రమాదకరమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే అర్థమవుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అప్పు దొరికిందని పండగ చేసుకోవడమేంటి.? కేంద్రం ఏ నిబంధన పెట్టినా, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్డిగా తలూపుతుండడంతో.. రాష్ట్రానికి సరికొత్తగా అప్పులు చేసుకునే వెసులుబాటు కలుగుతోంది.

సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకే ఆ సొమ్ముని అందిస్తున్నామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, దాని వల్ల ప్రయోజనమేంటి.? అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేస్తూ, ప్రజలను సోమరిపోతుల్లా మార్చతున్న ప్రభుత్వ విధానాలే రాష్ట్రానికి పెను శాపం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...