Switch to English

వైసీపీ మార్కు కరెంట్ షాక్.. టీడీపీ సౌజన్యంతో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఆడుతున్న డబుల్ గేమ్ తీరు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ‘ట్రూ అప్’ పేరుతో విద్యుత్ వినియోగదారులకు వాత పెడుతోంది వైఎస్ జగన్ సర్కార్. అబ్బే, ఈ వాత 2022 మార్చి వరకు మాత్రమేనని అధికారులు వివరణ ఇస్తున్నారు.

ఇంధన ఛార్జీల పెరుగుదల వల్లనే ట్రూ అప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తాత్కాలికంగా పెంచాల్సి వస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. మరోపక్క, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం, చంద్రబాబు సర్కార్ అనుసరించిన అస్తవ్యస్థ విధానాల వల్లనే విద్యుత్ ఛార్జీలను పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఇంతకీ, ఇంధన శాఖ కార్యదర్శి చెప్పింది నిజమా.? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది నిజమా.? సెప్టెంబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు ఛార్జీల తాత్కాలిక పెంపు.. అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ తర్వాత ఈ ట్రూ అప్ ఛార్జీల వడ్డన వుండదని ఇంధన శాఖ కార్యదర్శి చెబుతున్నా, ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఇప్పుడే ఊహించలేం.

వైఎస్ జగన్ హయాంలో అన్ని ధరలూ పెరిగిపోతున్నాయి.. రేట్లు ఆకాశాన్నంటున్నాయి.. విద్యుత్ ఛార్జీలు సైతం సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే ఏ సమస్య వచ్చిపడినా, చంద్రబాబు పాలన మీదకి నెపాన్ని నెట్టేయడం అలవాటైపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. మరోపక్క, తమ హయాంలో వైఫల్యాలను ప్రస్తావించకుండా, ప్రస్తుత ప్రభుత్వంపై అడ్డగోలుగా దుమ్మత్తి పోయడంలో తెలుగుదేశం పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

రెండు పార్టీలూ కలిసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోందిక్కడ. అవకాశం వున్న చోటల్లా బాదుడు పద్ధతికి తెరలేపుతూ, జనం జేబలుకు చిల్లుపెడుతున్న జగన్ సర్కార్.. ఇంకోపక్క, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే అప్పుల కోసం వెంపర్లాడుతున్న తీరు చూస్తోంటే, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల నెత్తిన వివిధ రకాల ఛార్జీల భారం, ధరల భారం మరింత పెరగనుందే తప్ప, తగే అవకాశమే లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

4 COMMENTS

  1. 151126 874527The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a great deal as this one. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something that you possibly can repair ought to you werent too busy on the lookout for attention. 101600

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...