Switch to English

ఆఫ్గనిస్థాన్ లో భీతావాహ పరిస్థితులు..! కాబుల్ పై ఉగ్రమూకల పంజా..!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఆఫ్గనిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకీ తీవ్రమైపోతున్నాయి. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన కాబుల్ లో అందరూ ఊహించినట్టే.. ఇంకాస్త ముందుగానే మారణహోమం జరిగింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల అబే గేటు వద్ద, సమీపంలోని బేరన్ హోటల్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడిలో 72 మంది మృతి చెందగా.. 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో అమెరికన్ మెరైన్ కమెండోలు 11 మంది, ఒక నేవీ వైద్యుడు, గాయపడినవారిలో అమెరికా సైన్యం 12 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడేనని పెంటగాన్ తెలిపింది. పేలుళ్లు జరిగిన ప్రదేశంలో చెల్లాచెదురైన శరీరాలు, గాయాలతో రక్తమోడుతూ బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావాహంగా మారింది. ఈ దాడులు జరగడానికి ముందు విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారనే సమాచారాన్ని అమెరికా నా అధికారులు బైడెన్ కు సమాచారమిచ్చారు. పేలుళ్లకు గంట ముందే బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా.. దాడులు జరగొచ్చని హెచ్చరించాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనే అప్రమత్తం చేస్తున్న తరుణంలోనే ఈ పేలుళ్లు జరిగాయి.

అయితే.. ఈ దాడులను తాలిబన్ ఖండించింది. ఈనెల 31.. ఆఫ్గన్ నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకునే చివరి రోజు. అప్పటివరకూ ఎటువంటి దాడులు జరగవని తాలిబన్ నేతలు అభయమిచ్చినా ఈ దారుణం జరిగింది. గతంలో విదేశీ బలగాలకు సహకరించిన ఆఫ్గన్లు, అమెరికా, మిత్ర దేశాల పౌరులు దేశం వీడేందుకు విమానాశ్రయానికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. 31లోపు వెళ్లకుంటే తాలిబన్లు తమ అంతం చూస్తారనే భయమే ఇందుకు కారణం. అయితే.. అమెరికా, మిత్ర దేశాల పౌరులు తరలించే క్రమంలో రక్తపాతం జరగకుండా ఇది సాధ్యం కాదని బైడన్ కొద్దిరోజుల కిందటే చెప్పడం విశేషం. కాబుల్ దాడిని భారత్ తోపాటు నాటో, ఐరాస ఖండించాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...