Switch to English

జనసేనాని పవన్ కళ్యాణ్ టైమింగ్.. వైసీపీలో షివరింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఓ చిన్న గ్రామంలో అధికార పార్టీ అరాచకంపై గళం విప్పాలంటే ఎంత ధైర్యం కావాలి.? ఎంత తెగువ కావాలి.? కానీ, ఓ గ్రామం అధికార పార్టీపై తిరగబడింది. అదే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినితి పొరుగూళ్ళ నుంచి గూండాల్ని తీసుకొచ్చి, గ్రామంపై దాడి చేశారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న ఆరోపణ. తూచ్, అదెలా జరుగుతుంది.? మేం గాంధేయవాదులం.. అని అధికార పార్టీ అనొచ్చుగాక. గ్రామంలో అధికార పార్టీ ఏ స్థాయిలో అరాచకం సృష్టించకపోతే, ఆ గ్రామం పేరు ఇంతలా మార్మోగిపోతుంది.? రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేళ చాలా ప్రలోభాలు నడిచాయి.. బెదిరింపులు చోటు చేసుకున్నాయి. అన్నీ జరిగాకనే, కొన్ని చోట్ల ఎన్నికలు జరగడం చూశాం.

ఈ పరిస్థితుల్లోనూ జనసేన బలపరిచిన ఓ దళిత మహిళ మత్సపురి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికవడం అధికార పార్టీకి కంటగింపుగా మారింది. గ్రామంలో అధికార పార్టీ అరాచకం సృష్టించింది. ఈ వ్యవహారంపై జనసైనికులు మండిపడితే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని సవాల్ చేశారు. దాంతో సీన్ మారిపోయింది. ‘పిచ్చి కుక్కల్ని మునిసిపాలిటీ వ్యాన్‌లో పడేయాల్సిందే’ అని జనసేనాని పవన్ చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. బోడిలింగం తర్వాత అంతకు మించిన స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది ఈ పిచ్చి కుక్క. ఇంకోపక్క, మత్స్యపురి ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన గెలిచిన పంచాయితీల్లో అరాచకాలకు ప్లాన్ చేసిన అధికార పార్టీ మద్దతుదారులు వెనకంజ వేస్తున్నారు.

మత్స్యపురి ఘటనలో ఎమ్మెల్యే తన స్థాయిని అత్యంత పతన స్థాయికి దిగజార్చేసుకున్నారు.. అది వైసీపీకి సైతం తీరని నష్టం కలిగించిందన్న అభిప్రాయం స్థానికంగా వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇదే చర్చ జరుగుతోంది. జనసేనాని స్పందించకపోయినా, ఆ స్పందనలో అత్యంత అప్రమత్తత లేకపోయినా.. ఈ స్థాయిలో అధికార పార్టీ అహంకారం నేలమట్టమయ్యేది కాదన్నది రాజకీయ విశ్లేషకలు అభిప్రాయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...