Switch to English

నితిన్ చెక్ మూవీ రివ్యూ – ఈ ఆటలో మజా లేదు.

Critic Rating
( 2.25 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow
Movie చెక్
Star Cast నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్
Director చంద్రశేఖర్ యేలేటి
Producer ఆనంద్ ప్రసాద్. వి
Music కళ్యాణి మాలిక్
Run Time 2 గం.20 ని
Release 26 ఫిబ్రవరి 2021

యంగ్ హీరో నితిన్ మొదటి సారి సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేసిన సినిమా ‘చెక్’. 70% జైలులో జరిగే ఈ కథలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ సారి క్రిటిక్స్ నుంచి ప్రశంశలే కాదు, కమర్షియల్ గా కూడా హిట్ అందుకుంటానంటున్న చంద్రశేఖర్ యేలేటి ‘చెక్’ ఎలా ఉందో చూసేద్దాం..

కథ:

2014లో టెర్రరిస్టులు చేసిన బాంబ్ బ్లాస్ట్ లో 40 మంది చనిపోతారు. ఆ బాంబ్ బ్లాస్ట్ కి కారణమైన నలుగురు టెర్రరిస్టులకు, ఆ టెర్రరిస్టులకు సహకరించిన ఆదిత్య(నితిన్)కి కూడా ఉరిశిక్ష వేస్తారు. కానీ ఆదిత్య నిర్దోషి అని, తనని కేసులో ఇరికించారని, కోర్టులో అప్పీల్ చేయడంతో ఆ కేసుని వాదించడం కోసం మానస(రకుల్ ప్రీత్ సింగ్) రంగంలోకి వస్తుంది. ఈ లోగా ఆదిత్య జైల్లో కలుసుకున్న శ్రీమన్నారాయణ(సాయి చంద్) ద్వారా చెస్ లో మాస్టర్ అవుతాడు. జైల్లో ఉన్న ఆదిత్య తను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేసాడు? మానసని ఎలా ఉపయోగించుకున్నాడు? అలాగే మాస్టర్ అనిపించుకున్న చెస్ గేమ్ అతనికి ఎంతవరకూ హెల్ప్ అయ్యింది? చివరికి ఆదిత్య నిర్దోషి అని ప్రూవ్ అయ్యాడా? లేక ఉరికంబం ఎక్కడా? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

నితిన్ ని ఇప్పటి వరకూ లవర్ బాయ్, మాస్ పాత్రల్లో చూసాం. కానీ ఇలాంటి సెటిల్ పెర్ఫార్మన్స్ ఉన్న పాత్రలో చూడడం ఇదే మొదటి సారి. డైరెక్టర్ అనుకున్న పాత్రకి నితిన్ పూర్తి న్యాయం చేసాడు. జైల్లో ఉన్నప్పుడు చూపించే ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ లాయర్ గా ఉన్నంతలో బాగా చేసింది. కానీ లుక్స్ విషయంలో మాత్రం కేర్ తీసుకోవాల్సింది. తన కాస్ట్యూమ్స్ చూడటానికి బాలేవు. ఇకపోతే ప్రియా వారియర్ ఉన్నది కాసేపే అయినా తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో కుర్రాళ్ళని పక్కాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే కీలక పాత్ర పోషించిన సాయి చంద్ గురించి కచ్చితంగా చెప్పాలి. చాలా సీన్స్ లో అతని నటన, డైలాగ్ డిక్షన్ ఆడియన్స్ కి ఆసక్తిని పెంచుతుంది. హర్ష వర్ధన్ సీన్స్ కాస్త నవ్విస్తాయి. సంపత్ రాజ్, మురళి శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు ఉన్నంతలో బాగా చేశారు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమాకి కెప్టెన్ అయిన చంద్ర శేఖర్ యేలేటి సినిమాలు అంటే కచ్చితంగా ఓ కొత్త పాయింట్ ఉంటుంది లేదా ఎమోషన్స్ తో ప్లే చేయడం చంద్రశేఖర్ యేలేటి స్పెషాలిటీ. కానీ ఈ సినిమాలో కొత్త కంటెంట్ మరియు ఎమోషనల్ టచ్ మిస్ అవ్వడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. కథలో పాత్రలన్నీ హీరోకి అనుగుణంగా వచ్చేసి హెల్ప్ చేస్తుంటాయి. టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. చాలా సింపుల్ అనిపించే ఈ కథకి కథనం అండ్ నేరేషన్ స్పీడ్ ఇంపార్టెంట్ కానీ కథనంలో ఇంటరెస్ట్ ని హోల్డ్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యారు, అలాగే నేరేషన్ చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా బాగానే అనిపించినా సెకండాఫ్ మాత్రం కంప్లీట్ డ్రాప్ అయిపోవడం, బాగా స్లో నేరేషన్ తో బోర్ కొట్టించేయడం, చెస్ గేమ్ అంత ఆసక్తిని క్రియేట్ చేయలేకపోవడంతో క్లైమాక్స్ వచ్చేలోపు నీరసం వచ్చేస్తుంది. చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ వలన కాస్త ఊపిరి పీల్చుకొని థియేటర్ నుంచీ బయటకి వస్తాం. అలాగే క్లైమాక్స్ హాలీవుడ్ ఇన్సైడ్ మాన్ ని పోలి ఉంటుంది. ఇకపోతే డైరెక్టర్ గా చంద్ర శేఖర్ యేలేటి తన మార్క్ ని ఈ చెక్ లో చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. కమర్షియల్ సక్సెస్ అనే మాయలో పడి తన రూట్ మార్చి, అటు ఇటు వెళ్లడం వలన ఆయన స్టాండర్డ్స్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. అలాగే కొందరికి ఇది చంద్రశేఖర్ యేలేటి సినిమానేనా అనే ఫీలింగ్ కూడా వస్తుంది.

డైలాగ్స్ చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ కి అవసరం లేకపోయినా హై లెవల్లో ఉన్నాయి అనిపిస్తుంది. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ బాగుంది, సాంగ్ సినిమాలో కూడా బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇకపోతే, రాహుల్ శ్రీవత్సవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది. జైలు ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నితిన్ పెర్ఫార్మన్స్
– ఆర్ట్ వర్క్ అండ్ మ్యూజిక్
– క్లైమాక్స్ థ్రిల్స్

బోరింగ్ మోమెంట్స్:

– కొత్తదనం లేని కథ
– బోరింగ్ కథనం
– సాగదీసి చిరాకు తెప్పించే నేరేషన్
– చంద్రశేఖర్ యేలేటి మార్క్ కనిపించని డైరెక్షన్
– ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం

విశ్లేషణ:

తెలుగు సినిమాకి సరికొత్త కథలని పరిచయం చేసిన చంద్రశేఖర్ యేలేటి నుంచీ వచ్చిన ‘చెక్’ సినిమా ప్రేక్షకులను చాలా వరకూ నిరాశని కలిగిస్తుంది. నితిన్ పాత్రని చూపించడంలో, అక్కడక్కడా కొన్ని పాయింట్స్ బాగుండడంతో పాటు పరవాలేధనిపించే క్లైమాక్స్ ని పక్కన పెడితే మిగతా అంతా చాలా బోరింగ్ గా ఉంది. అంటా కమర్షియల్ ధోరణిలో వెళ్తున్నప్పుడు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన చంద్రశేఖర్ యేలేటి, ప్రేక్షకులు అప్డేట్ అయ్యి కొత్తదనం ఎంకరేజ్ చేస్తున్న టైములో చెక్ లాంటి సినిమా చేయడం బాధాకరం.

చూడాలా? వద్దా?: పరవాలేధనిపించే క్లైమాక్స్ కోసం సినిమా చూడగలరా?

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.25/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...