Switch to English

కేసీఆర్‌పై ‘మంచు’ భక్తి.. సాక్ష్యమిదే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

ఇంటర్మీడియట్‌ ఫలితాలు తెలంగాణాలో రాజకీయ అలజడికి కారణమయ్యాయి. నేరం నిజం.. విద్యార్ధుల ప్రాణాలు పోతున్నదీ వాస్తవం. 20 మందికి పైగా విద్యార్ధులు పరీక్షా ఫలితాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడ్డారంటే, జరిగింది చిన్న పొరపాటే అయినా, దాన్ని చాలా పెద్ద నేరంగా భావించాలి. ఒకటి కాదు, రెండు కాదు, 60 వేల మంది విద్యార్ధుల భవితవ్యాలు మార్కుల లిస్టులో పొరపాట్ల కారణంగా తారుమారయ్యే పరిస్థితి వచ్చిందంటే చిన్న తప్పిదమని ఎలా అనగలం.? సాంకేతిక సాయం అందించిన సంస్థ ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ మాత్రమే కాదు. ప్రభుత్వం ఈ మొత్తం వైఫల్యానికి బాధ్యత వహించాలి.

విద్యా సంస్థల అధిపతి అయిన సినీ నటుడు మంచు మోహన్‌బాబు తెలంగాణాలో విద్యార్ధుల ఆత్మహత్యలపై స్పందించారు. అయితే విద్యార్ధుల పట్ల జాలి కన్నా, తెలంగాణా ముఖ్యమంత్రిపై భక్తి ఈ స్పందనలో బాగా కనిపించింది. మోహన్‌బాబుతో పాటు, ఆయన కుమారుడూ విద్యార్ధులకు భరోసా ఇస్తున్నట్లు కనిపిస్తూనే, తెలంగాణా ప్రభుత్వానికి జరిగిన డ్యామేజీని తగ్గించేందుకే స్పందించినట్లు ఉంది వ్యవహారం. ప్రభుత్వాలు స్పందిస్తాయి. అది ప్రభుత్వాల బాధ్యత. కానీ 23 మంది విద్యార్ధుల ప్రాణాలు పోయాక, స్పందించడం ఆక్షేపణీయమే.

ఇదే ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉంటే, వ్యక్తిగత రాజకీయ వైరంతో చంద్రబాబుపై మోహన్‌బాబు ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో. ఫీజు రీ – ఎంబర్స్‌మెంట్స్‌ విషయంలో చంద్రబాబుపై మండిపడుతూ విద్యార్ధులతో కలిసి ఆందోళన చేశారు కొద్దిరోజుల క్రితం మోహన్‌బాబు. అది విద్యార్ధుల ప్రాణాలు తీసేంత పెద్ద సమస్య కాదు. పైగా ప్రభుత్వం స్పందించింది.. పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ తెలంగాణాలో పరిస్థితి వేరు. విద్యార్ధులే రోడ్డెక్కారు. వారి తల్లితండ్రులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు అరెస్టులతో విద్యార్ధుల్ని, వారి తల్లితండ్రుల్నీ భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఇంతటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో విద్యార్ధులెవరకూ ఆత్మహత్య చేసుకోవద్దు.. అని చెప్పడంతో సరిపెట్టకుండా, ప్రభుత్వం స్పందించింది.. అని కితాబులివ్వడంలో అసలు మతలబు ఏంటో మంచు వారికే తెలియాలి. ముక్కు సూటి మనిషినని చెప్పుకునే మోహన్‌బాబు ఈ విషయంలో ఎందుకు ముక్కు సూటితనం ప్రదర్శించలేదు.. అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. నిలదీస్తున్నారు. ఈ హీట్‌ మంచు ఫ్యామిలీకి చాలా గట్టిగా తగులుతోంది.

విద్యా సంస్థల అధిపతిగానే కాదు, సినీ నటుడిగానూ మోహన్‌బాబు అంటే చాలామందికి అభిమానం. కానీ, ఇప్పుడు ఈ విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు స్పందించిన తీరు అభిమానుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ, తెలంగాణ రాష్ట్ర సమితికీ లోపాయకారీ ఒప్పందాలున్నాయన్నది వాస్తవం. మోహన్‌బాబు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మాత్రమే. బహుశా అధినేత జగన్‌ ఆదేశాలతోనే మోహన్‌బాబు, ఆయన తనయుడు ఇంత జాగ్రత్తగా ఇంతటి సీరియస్‌ ఇష్యూపై రియాక్ట్‌ అయ్యారని అనుకోవాల్సి వస్తుంది.

‘స్పందించకపోయినా బావుండేది.. ప్రభుత్వానికి కితాబులిచ్చేందుకు.. మా సమస్యను చిన్నదిగా చూస్తారా.? పిల్లల ప్రాణాల విలువ మీకు తెలియదా? మీ రాజకీయాల కోసం మా సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయడానికి మీరెవరు.?’ అని బాధిత విద్యార్థులే సోషల్‌ మీడియాలో వేదికగా మంచు మోహన్‌బాబునీ, మంచు విష్ణునీ ప్రశ్నిస్తున్నారు. తమ ఆవేదనకు సంబంధించిన ఆధారాల్నీ మంచు హీరోల ముందుంచుతున్నారు. ఈ సంకట స్థితిపై మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు ఇంకో వివరణ ఇస్తారా? వేచి చూడాలిక.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...